మెగాస్టార్ క్లాసిక్‌కు సీక్వెల్ ?

మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రాల్లో ఎవర్ గ్రీన్ క్లాసిక్ గా నిలిచిపోయిన చిత్రం ‘విజేత’. ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా అప్పటి ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించింది. తన చెల్లెలి పెళ్ళి కోసం తన కిడ్నీనే త్యాగం చేసిన ఉదాత్తమైన పాత్రలో చిరంజీవి జీవించారు. అప్పట్లో ఈ సినిమా బిగినింగ్ లో తాను ఒక విభిన్నమైన గొప్ప ప్రయత్నం చేశానని, దీన్ని ఆదరించాలని చిరంజీవి ప్రేక్షకుల్ని కోరడం కనిపిస్తుంది. ఆ టైమ్‌కే చిరంజీవి టాలీవుడ్ లో టాప్ హీరో. అయినప్పటికీ తన ఇమేజ్ ను పక్కన పెట్టి డిఫరెంట్ గా ప్రయత్నం చేశారు. సినిమా కమర్షియల్ గా కూడా మంచి సక్సెస్ సాధించింది. ఆ సినిమా వచ్చి ఇప్పటికి 36 ఏళ్ళు దాటిపోయింది. ఈ నేపథ్యంలో ‘విజేత’ చిత్రానికి చిరంజీవి సీక్వెల్ చేయబోతున్నారనే టాక్స్ వినిపిస్తున్నాయి. 


‘యన్టీఆర్ సిరీస్, 83, తలైవి’ లాంటి చిత్రాల్ని నిర్మించిన విష్ణు ఇందూరి ఈ సినిమాను నిర్మించబోతున్నారని సమాచారం. సైమా అవార్డుల్ని నిర్వహించే విష్ణుకి చిరంజీవితో మంచి అనుబంధం ఉంది. తనకో సినిమా చేయాలని చిరుని అడగ్గా ఆయన అంగీకరించారని టాక్.  తనకి బాగా నచ్చిన ‘విజేత’ చిత్రానికి సీక్వెల్ తీయబోతున్నట్టు విష్ణు చిరుకి చెప్పారట. దాంతో చిరంజీవి ఈ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వినికిడి. కథ, దర్శకుడు రెడీ అయ్యాకా ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళబోతున్నట్టు సమాచారం. మరి ఈ వార్తల్లో నిజానిజాలేంటో తెలియాలంటే.. కొద్దిరోజులు ఆగాల్సిందే. 

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.