రవితేజ ‘రావణాసుర’ ప్రారంభోత్సవానికి అతిథిగా చిరు

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కబోతోన్న ‘రావణాసుర’ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న లాంఛనంగా ప్రారంభం కాబోతోంది. ఈ ప్రారంభోత్సవానికి మెగాస్టార్ చిరంజీవి అతిథిగా రాబోతున్నట్లుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్, ఆర్‌టీ టీం వర్క్స్ బ్యానర్లపై అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. రవితేజకి ఇది 70వ చిత్రం. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను చిత్రయూనిట్ విడుదల చేయగా.. సూపర్బ్ రెస్సాన్స్‌ను అందుకుంది.

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.