తనయుడికి బర్త్ డే విషెస్ తెలిపిన మెగాస్టార్

ABN , First Publish Date - 2022-03-27T18:58:25+05:30 IST

మెగా‌పవర్ స్టార్ రామ్ చరణ్ తాజా చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’ రెండు రోజుల క్రితం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో సందడి చేసిన సంగతి తెలిసిందే. బ్లాక్ బస్టర్ టాక్ తో వసూళ్ళ వర్షంతో దుమ్మురేపుతోంది ఈ సినిమా. యన్టీఆర్,రామ్ చరణ్ లను ఒక ఫ్రేమ్ లో చూసి మురిసిపోతున్నారు ఇరువురి ఫ్యాన్స్. అభిమానులకు ఈ సినిమాతో ఇద్దరు హీరోలు మరిచిపోలేని మాస్ ట్రీట్ ఇచ్చారు. నేడు (ఆదివారం) మెగా ఫ్యాన్స్ కు మరో పండుగ వచ్చింది. అదే రామ్ చరణ్ బర్త్ డే. తన పుట్టిన రోజును ఒక బాధ్యతగా తీసుకుంటానని ఫ్యాన్స్ కు చెప్పాడు రామ్ చరణ్. అతడి బర్త్ డే ను పురస్కరించుకొని పలువురు టాలీవుడ్ సెలబ్రిటీస్ చెర్రీకి సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

తనయుడికి బర్త్ డే విషెస్ తెలిపిన మెగాస్టార్

మెగా‌పవర్ స్టార్ రామ్ చరణ్ తాజా చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’ రెండు రోజుల క్రితం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో సందడి చేసిన సంగతి తెలిసిందే. బ్లాక్ బస్టర్ టాక్ తో వసూళ్ళ వర్షంతో దుమ్మురేపుతోంది ఈ సినిమా. యన్టీఆర్,రామ్ చరణ్ లను ఒక ఫ్రేమ్ లో చూసి మురిసిపోతున్నారు ఇరువురి ఫ్యాన్స్. అభిమానులకు ఈ సినిమాతో ఇద్దరు హీరోలు మరిచిపోలేని మాస్ ట్రీట్ ఇచ్చారు. నేడు (ఆదివారం) మెగా ఫ్యాన్స్ కు మరో పండుగ వచ్చింది. అదే రామ్ చరణ్ బర్త్ డే. తన పుట్టినరోజును ఒక బాధ్యతగా తీసుకుంటానని ఫ్యాన్స్ కు చెప్పాడు రామ్ చరణ్. అతడి బర్త్ డే ను పురస్కరించుకొని పలువురు టాలీవుడ్ సెలబ్రిటీస్ చెర్రీకి సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు సైతం.. ఆర్.ఆర్.ఆర్ చిత్రాన్ని ఓ రేంజ్ లో పొగడ్తల్లో ముంచెత్తుతూ ట్వీట్ చేశాడు. అలాగే.. చరణ్ కు మహేశ్ తనదైన శైలిలో బర్త్ డే విషెస్ తెలిపాడు. 


ఇదిలా ఉంటే.. తండ్రి మెగాస్టార్ చిరంజీవి.. తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా తనయుడు రామ్ చరణ్ కు బర్త్ డే విషెస్ తెలిపారు. ‘రాంచరణ్ కి సోషల్ మీడియా ద్వారా బర్త్ డే విషెస్ చెప్పటం నాకు వింతగా అనిపిస్తుంది. అయితే ఈ అకేషన్‌లో రామ్ చరణ్ పిక్ ఒకటి  షేర్ చేస్తే అభిమానులు ఆనందిస్తారనిపించింది.. అంటూ ‘స్వయంకృషి’ షూటింగ్ టైమ్ లో చిన్నారి చెర్రీని చిరు ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఉన్న ఫోటో ను, ‘ఆచార్య’లో ఇద్దరూ కలిసి నటించిన ఒక సన్నివేశంలోని లొకేషన్ పిక్ ను షేర్ చేస్తూ..  కొడుకుగా వాడు నన్ను గర్వపడేలా చేస్తున్నాడు. వాడు నాకు గర్వకారణం అని చిరంజీవి ట్వీట్ చేశారు. 





Updated Date - 2022-03-27T18:58:25+05:30 IST