అండర్‌కవర్ కాప్‌గా మెగాస్టార్?

ABN , First Publish Date - 2021-12-09T21:19:34+05:30 IST

మెగాస్టార్ చిరంజీవి.. తన కెరీర్ లో ఎప్పుడూ లేని విధంగా వరుస సినిమాల్ని సెట్స్ పైకి తీసుకెళ్తూ యంగ్ హీరోలకు సవాల్ విసురుతున్నారు. ‘ఆచార్య’ సినిమాను విడుదలకు సిద్దం చేసిన చిరు.. తర్వాత ‘గాడ్ ఫాదర్, భోళాశంకర్’, బాబీ దర్శకత్వంలోని సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. ఈ మూడు సినిమాల్లోని ఆయన గెటప్స్ ఎలా ఉండబోతున్నాయి అనే ఆత్రుతతో ఉన్నారు అభిమానులు. అయితే వీటిలో బాబీ సినిమాలో మాత్రం చిరును నెవర్ బిఫోర్ అవతార్ లో పక్కా మాస్ మేకోవర్ తో బాబీ చూపించబోతున్నారట.

అండర్‌కవర్ కాప్‌గా మెగాస్టార్?

మెగాస్టార్ చిరంజీవి.. తన కెరీర్ లో ఎప్పుడూ లేని విధంగా వరుస సినిమాల్ని సెట్స్ పైకి తీసుకెళ్తూ యంగ్ హీరోలకు సవాల్ విసురుతున్నారు. ‘ఆచార్య’ సినిమాను విడుదలకు సిద్దం చేసిన చిరు.. తర్వాత ‘గాడ్ ఫాదర్, భోళాశంకర్’, బాబీ దర్శకత్వంలోని సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. ఈ మూడు సినిమాల్లోని ఆయన గెటప్స్‌పై చాలా  ఆత్రుతగా ఉన్నారు అభిమానులు. అయితే వీటిలో బాబీ సినిమాలో మాత్రం చిరును నెవర్ బిఫోర్ అవతార్ లో పక్కా మాస్ మేకోవర్ తో బాబీ చూపించబోతున్నారట. అంతేకాదు ఈ సినిమాకి సంబంధించి ఓ క్రేజీ రూమర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 


శ్రీలంక బ్యాక్ డ్రాప్ లో కోస్టల్ ఏరియా నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందట. చిరంజీవి గెటప్ ‘ముఠామేస్త్రి’ లోని కూలి తరహాలో ఉండబోతోందని టాక్.  అలాగే ఇందులో ఇంకో ట్విస్ట్ ఉంది.  చిరు ‘పోకిరి’ తరహాలో అండర్ కవర్ కాప్ గా అలరించబోతున్నారని తెలుస్తోంది.  ఇంతకు ముందు చిరంజీవి ‘రుస్తుం, స్టేట్‌రౌడీ’ చిత్రాల్లో అండ్ కవర్‌కవర్ కాప్ గా అదరగొట్టారు. ఈ రెండు సినిమాలు అప్పట్లో మంచి సక్సెస్ సాధించాయి. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాణం జరుపుకుంటోన్న ఈ సినిమాకి ‘వాల్తేరు వీర్రాజు, వాల్తేరు శ్రీను’ లాంటి టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. మరి నిజంగానే చిరు అండర్ కవర్ కాప్ గా నటిస్తున్నారో లేదో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే. 

Updated Date - 2021-12-09T21:19:34+05:30 IST