22 ఏళ్ళ తర్వాత మళ్లీ అవే పాత్రల్లో చిరు, రవితేజ ?

ABN , First Publish Date - 2022-01-12T20:52:16+05:30 IST

మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో అభిమానులకు మాస్ ఫీస్ట్ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. ‘ఆచార్య’ చిత్రం విడుదలకు రెడీగా ఉండగా.. ‘గాడ్ ఫాదర్, భోళాశంకర్’, బాబీ దర్శకత్వంలోని సినిమాలు ప్రస్తుతం సెట్స్ పై ఉన్నాయి. వీటితో పాటు వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా ఈ మధ్యనే అనౌన్స్ అయింది. వీటిలో బాబీ సినిమాకి ‘వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. వైజాగ్ షిప్ యార్డ్ బ్యాక్ డ్రాప్ లో సాగే మాస్ యాక్షన్ మూవీగా ఇది తెరకెక్కుతోంది. అలాగే ఇందులో చిరు అండ్‌కవర్ కాప్ గా నటిస్తున్నట్టుగా కూడా ఓ వార్త వినిపిస్తోంది. ఇక ఈ సినిమా మరో ప్రత్యేకత ఏంటంటే.. ఇందులో రవితేజ ఓ ప్రత్యేక పాత్రలో కూడా నటిస్తున్నట్టు తెలుస్తోంది.

22 ఏళ్ళ తర్వాత మళ్లీ అవే పాత్రల్లో చిరు, రవితేజ ?

మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో అభిమానులకు మాస్ ఫీస్ట్ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. ‘ఆచార్య’ చిత్రం విడుదలకు రెడీగా ఉండగా.. ‘గాడ్ ఫాదర్, భోళాశంకర్’, బాబీ దర్శకత్వంలోని సినిమాలు ప్రస్తుతం సెట్స్ పై ఉన్నాయి. వీటితో పాటు వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా ఈ మధ్యనే అనౌన్స్ అయింది. వీటిలో బాబీ సినిమాకి ‘వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. వైజాగ్ షిప్ యార్డ్ బ్యాక్ డ్రాప్ లో సాగే మాస్ యాక్షన్ మూవీగా ఇది తెరకెక్కుతోంది. అలాగే  ఇందులో చిరు అండ్‌కవర్ కాప్ గా నటిస్తున్నట్టుగా కూడా ఓ వార్త వినిపిస్తోంది. ఇక ఈ సినిమా మరో ప్రత్యేకత ఏంటంటే.. ఇందులో రవితేజ ఓ ప్రత్యేక పాత్రలో కూడా నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన చిరంజీవికి తమ్ముడిగా నటిస్తున్నారట. ఆయన పాత్ర దాదాపు40 నిమిషాలుంటుందట. 


22 ఏళ్ళ క్రితం వచ్చిన ‘అన్నయ్య’ చిత్రంలో చిరుకి తమ్ముడిగా రవితేజ నటించిన సంగతి తెలిసిందే. సౌందర్య చెల్లెల్ని అల్లరి పెట్టి ఆమెను ప్రేమలో పడేసే పాత్ర చేశారు రవితేజ. ఆయనతో పాటు వెంకట్ కూడా మరో తమ్ముడిగా నటించారు. ఇంత కాలానికి మళ్ళీ మెగాస్టార్ తమ్ముడిగా రవితేజ నటించనుండడం విశేషంగా మారింది. ‘పవర్’ సినిమాతో బాబీని రవితేజ దర్శకుడిగా మార్చిన సంగతి తెలిసిందే. సినిమా సూపర్ హిట్టవడంతో బాబీకి మంచి పేరొచ్చింది. అందుకే ఇప్పుడీ సినిమాలో రవితేజ కోసం ఓ పవర్ ఫుల్  పాత్ర డిజైన్ చేశాడట బాబీ. రవితేజ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చిందట.   

Updated Date - 2022-01-12T20:52:16+05:30 IST