రేర్‌ పిక్‌: లొకేషన్‌లో చిరు, దాసరి

శతాధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన డాక్టర్‌ దాసరి నారాయణరావు, మెగాస్థార్‌ చిరంజీవి కాంబినేషన్‌లో వచ్చిన ఏకైక సినిమా ‘లంకేశ్వరుడు’. ఇది దాసరికి నూరో చిత్రం కావడం గమనార్హం. అంతకుముందు ఎంతోమంది నిర్మాతలు ఈ కాంబినేషన్‌లో సినిమా తీయాలని ప్రయత్నించినా సాధ్యపడలేదు. నిర్మాత వడ్డే రమేశ్‌కే ఆ అవకాశం దక్కింది. చిరంజీవి సినిమా అనగానే డాన్సులు, ఫైట్లు ఆశిస్తారు ప్రేక్షకులు. ‘లంకేశ్వరుడు’ చిత్రంలో ఆ రెండింటితో పాటు ఓ కొత్త చిరంజీవిని ఇందులో చూడవచ్చు. చెల్లెలి ప్రేమ కోసం తపించే అన్నయ్యగా ఆయన ఇందులో కనిపిస్తారు. డైలాగులకు దాసరి పెట్టింది పేరు. ఆ డైలాగుల్ని చిరంజీవి నోట వినడం అభిమానులకు కొత్త అనుభూతి కలిగించింది. ఈ చిత్రానికి రాజ్‌-కోటి సంగీత దర్శకత్వం వహించారు. పాటల రికార్డింగ్‌ సందర్బంగా వారిద్దరితో చర్చిస్తున్న దాసరి, చిరంజీవిలను ఇందులో చూడవచ్చు

-వినాయకరావు

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.