మెగాస్టార్‌తో అనిల్ రావిపూడి?

ABN , First Publish Date - 2021-11-28T21:08:59+05:30 IST

మెగాస్టార్ చిరంజీవి స్పీడ్ మామూలుగా లేదు. ఎప్పుడూ లేనిది.. వరుసగా సినిమాల్ని పట్టాలెక్కించేస్తున్నారు చిరు. ఆచార్య తర్వాత ‘గాడ్ ఫాదర్, భోళాశంకర్’ చిత్రాల్ని ఏకకాలంలో సెట్స్ మీదకు తీసుకెళ్ళిన ఆయన.. కొద్ది రోజుల్లో బాబీ సినిమా షూటింగ్ ను కూడా మొదలు పెట్టబోతున్నారు. ఆ తర్వాత మారుతి, వెంకీ కుడుముల చిత్రాల్ని కూడా అనౌన్స్ చేయబోతున్నారు. అలాగే త్రివిక్రమ్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా ఉండబోతోంది. ఇవి కాకుండా చిరంజీవి ఇప్పుడు మరో దర్శకుడికి కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.

మెగాస్టార్‌తో అనిల్ రావిపూడి?

మెగాస్టార్ చిరంజీవి స్పీడ్ మామూలుగా లేదు. ఎప్పుడూ లేనిది.. వరుసగా సినిమాల్ని పట్టాలెక్కించేస్తున్నారు చిరు. ఆచార్య తర్వాత ‘గాడ్ ఫాదర్, భోళాశంకర్’ చిత్రాల్ని ఏకకాలంలో సెట్స్ మీదకు తీసుకెళ్ళిన ఆయన.. కొద్ది రోజుల్లో బాబీ సినిమా షూటింగ్ ను కూడా మొదలు పెట్టబోతున్నారు. ఆ తర్వాత మారుతి, వెంకీ కుడుముల చిత్రాల్ని కూడా అనౌన్స్ చేయబోతున్నారు. అలాగే త్రివిక్రమ్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా ఉండబోతోంది. ఇవి కాకుండా చిరంజీవి ఇప్పుడు మరో దర్శకుడికి కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఆయన మరెవరో కాదు.. అనిల్ రావిపూడి. ఇప్పటి వరకూ ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా.. సినిమాలు చేసుకుంటూ వెళుతున్న అనిల్.. చిరుని ఇటీవల ఒక స్టోరీలైన్ తో పడగొట్టారట. చిరంజీవి దానికి బాగా ఇంప్రెస్ అయి.. ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. 


కామెడీ ఎంటర్ టైనర్స్ తీయడంలో చెయితిరిగిన అనిల్, కామెడీ టైమింగ్ లో తిరుగులేని మెగాస్టార్ కలిస్తే.. అభిమానులకు పండగే. ఖచ్చితంగా ఈ కాంబినేషన్ ఓ రేంజ్ లో వర్కవుట్ అవుతుందని చెప్పొచ్చు. ప్రస్తుతం ‘ఎఫ్ 3’ చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్న అనిల్.. తర్వాత ఓ సీనియర్ హీరోతో సినిమా చేయబోతున్నారు. దాని తర్వాత మెగాస్టార్ సినిమా పట్టాలెక్కుతుంది. ఈలోపు చిరంజీవి ‘గాడ్ ఫాదర్ , భోళాశంకర్’, బాబీ చిత్రాల్ని కంప్లీట్ చేస్తారు. 2022లో ఈ మూడు చిత్రాల్ని విడుదల చేయాలని చిరు భావిస్తున్నారు. వీటి తర్వాత మారుతి, వెంకీ కుడుముల సినిమాల్ని లైన్ లో పెడతారట చిరు. ఆ తర్వాత అనిల్ సినిమా ఉంటుందని సమాచారం. మరి ఈ వార్తల్లోని నిజానిజాలేంటో చూడాలి.  

Updated Date - 2021-11-28T21:08:59+05:30 IST