Chiranjeevi: మెగా సంబరాలు

ABN , First Publish Date - 2021-08-23T02:03:30+05:30 IST

చిరంజీవి... చిరంజీవి... చిరంజీవి... తెలుగు చిత్రసీమలో, సోషల్‌ మీడియాలో ఆదివారం ఎటు చూసినా ఈ పేరే వినిపించింది. అభిమానుల నోట మెగా మంత్రం అయింది. తారాలోకం పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి కారణమైంది. వెరసి... పరిశ్రమలో ఓ విధమైన వేడుక వాతావరణం కనిపించింది.

Chiranjeevi: మెగా సంబరాలు

చిరంజీవి... చిరంజీవి... చిరంజీవి... తెలుగు చిత్రసీమలో, సోషల్‌ మీడియాలో ఆదివారం ఎటు చూసినా ఈ పేరే  వినిపించింది. అభిమానుల నోట మెగా మంత్రం అయింది. తారాలోకం పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి కారణమైంది. వెరసి... పరిశ్రమలో ఓ విధమైన వేడుక వాతావరణం కనిపించింది. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ‘గాడ్‌ ఫాదర్‌’, ‘భోళా శంకర్‌’ టైటిళ్లతో పాటు 154వ చిత్రానికి సంబంధించిన లుక్‌లను విడుదల చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ మంత్రి కేటీఆర్‌, సోము వీర్రాజుతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు, క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ సహా సినిమా తారలు చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 


ఫోన్‌లో చంద్రబాబు శుభాకాంక్షలు 

చంద్రబాబు నాయుడు స్వయంగా ఫోన్‌లో చిరంజీవికి బర్త్‌ డే శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘కరోనా క్లిష్ట సమయంలో మీరు చేస్తున్న  సేవా కార్యక్రమాలు ఎంతో బావున్నాయి. సమాజానికి అలాగే పరిశ్రమలో సినీ కార్మికులకు ఉపయోగపడేలా మీరు చేస్తున్న ేసవాకార్యక్రమాలు గమనిస్తున్నాను. చాలా మంచి కార్యక్రమాలు చేస్తూ  సేవా ధృక్పథంతో ఉన్న మీకు నా శుభాభినందనలు’’ అని చంద్రబాబు ప్రశంసించారు. సినీపరిశ్రమలోనూ గత వైభవాన్ని గుర్తు తెచ్చేలా మీరు రాణిస్తున్న విధానం... ఎంతో ఇష్టంతో కష్టపడుతున్న సినిమాల్లో రాణించాలని మీ లెగసీ ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను’’ అని చిరంజీవి కృషిపైనా చంద్రబాబు నాయుడు ప్రశంసలు కురిపించారు. 



చిరంజీవి ఇంటికి పవన్‌...

పవన్‌కల్యాన్‌ తన అన్నయ్య చిరంజీవి ఇంటికి వెళ్లి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ పండుగ కడాఆ కలిసి రావడంతో సోదరులు ముగ్గురు తన సోదరీమణులతో రాఖీ కట్టించుకున్నారు. ‘‘అన్నయ్యను ఆరాధించే లక్షలాదిమందిలో నేను తొలి అభిమానిని. ఆయన నాకే కాదు... ఎందరికో మార్గదర్శి, స్ఫూర్తిప్రదాత, ఆదర్శప్రాయుడు. ఆపదలో ఉన్నోళ్లను ఆదుకోవడానికి ముందుంటారు. దానలు, గుప్తదానాలెన్నో చేశారు. మా కుటుంబంలో అన్నయ్యగా పుట్టినా మమ్మల్ని తండ్రిగా సాకారు. తండ్రి స్థానంలో నిలిచారు’’ అని పవన్‌ కల్యాణ్‌ శుభాకాంక్షలు తెలిపారు.


చెల్లెళ్లకు డబుల్‌ సెలబ్రేషన్స్‌.

ఇక... కుటుంబ సభ్యులు, సినీ తారలు, అభిమానుల రాకతో మెగాస్టార్‌ ఇంటి వద్ద సందడి నెలకొంది. చిరంజీవి చెల్లెళ్లకు ఆదివారం డబుల్‌ సెలబ్రేషన్స్‌. అన్నయ్యకు రాఖీలు కట్టడంతో పాటు పుట్టినరోజును కూడా సెలబ్రేట్‌ చేశారు. గీతా ఆర్ట్స్‌ టీమ్‌తో అల్లు అరవింద్‌ చిరంజీవిని కలిశారు. బ్లడ్‌ బ్యాంక్‌ దగ్గర అభిమానులు రక్తదానం చేశారు.











Updated Date - 2021-08-23T02:03:30+05:30 IST