చిన్మయి: అమ్మాయిలను స్వేచ్ఛగా బతకనివ్వండి!

ABN , First Publish Date - 2021-12-06T19:41:28+05:30 IST

సింగర్‌, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ చిన్మయి గురించి పరిచయం అవసరం లేదు. గాయనిగా ఎంత గొప్ప పేరు ఉందో కాంట్రవర్సీ క్వీన్‌గా కూడా అంతే పేరు ఉంది. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె సమాజంలో జరిగే అన్యాయాల గురించి తరచూ స్పందిస్తుంటుంది. స్త్రీలకు అన్యాయం జరిగితే అసలు సహించదు. గతంలో క్యాస్టింగ్‌ కౌచ్‌ గురించి బహిరంగంగా పోరాడింది. అమ్మాయిలకు పెళ్లిళ్ల గురించి కూడా సోషల్‌ మీడియా వేదికగా సలహాలు ఇస్తుంటుంది.

చిన్మయి: అమ్మాయిలను స్వేచ్ఛగా బతకనివ్వండి!

సింగర్‌, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ చిన్మయి గురించి పరిచయం అవసరం లేదు. గాయనిగా ఎంత గొప్ప పేరు ఉందో కాంట్రవర్సీ క్వీన్‌గా కూడా అంతే పేరు ఉంది. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె సమాజంలో జరిగే అన్యాయాల గురించి తరచూ స్పందిస్తుంటుంది. స్త్రీలకు అన్యాయం జరిగితే అసలు సహించదు. గతంలో క్యాస్టింగ్‌ కౌచ్‌ గురించి బహిరంగంగా పోరాడింది. అమ్మాయిలకు పెళ్లిళ్ల గురించి కూడా సోషల్‌ మీడియా వేదికగా సలహాలు ఇస్తుంటుంది. అలా చేసిన ప్రతిసారి నెటిజన్లు ఆమెను ట్రోల్‌ చేస్తూనే ఉంటారు. వాటికి ధీటుగానే చిన్మయి సమాధానం ఇస్తుంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో వేదికగా అమ్మాయిల పెళ్లిల్లు, అబ్రాడ్‌ సంబంధాల గురించి చిన్మయి స్పందించింది. 


‘డ్రంకెన్‌ డ్రైవింగ్‌, ఓవర్‌ స్పీడ్‌ గురించి ఒక అవగాహన కార్యక్రమం ఉందనుకోండి.. ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవి చేయాలి. అవి చేయొద్దు అని రూల్స్‌ చెబుతారు. అంటే ప్రతీ ఒక్కరూ తాగి వాహనాలు నడుపుతున్నారని కాదు. అది ఎవరికి అవసరమో వారికే చెబుతున్నట్లు లెక్క. నేను పెడుతున్న ఇన్‌స్టా స్టోరీస్‌ చూసి ఎన్‌ఆర్‌ఐలు  ‘అలా కాదు, జనరలైజ్‌ చేయకే.. అని వాగనక్కర్లేదు. ఓ అమ్మాయి తన జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాలను అందరికీ చెబుతున్నాను. దీని వల్ల మరో అమ్మాయి జాగ్రత్త పడుతుందని. ఈ ఫారెన్‌ సంబంధాల గురించి నాకు ఎప్పటికీ అర్థం కాదు. తమ కూతురుకు గౌరవంగా జీవించే అవకాశం అస్సలు ఇవ్వరు. తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచీ అల్లారుముద్దుగా పెంచుకున్న ఆడ బిడ్డల్ని పెళ్లి దగ్గరకు వచ్చేసరికి ఎందుకు స్వేచ్ఛ లేకుండా చేస్తారో అర్థం కాదు. తన కాళ్ల మీద తాను నిలబడే స్వేచ్ఛ ఇవ్వని తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తుంటాను. కోట్లు కట్నం ఇచ్చి అబ్రాడ్‌ సంబంధం చూసి మరీ పెళ్లి చేస్తారు. కానీ అమ్మాయిలను మాత్రం ఆర్థికంగా, స్వతంత్రంగా బతకనివ్వరు. అమ్మాయిలు ఆర్థికంగా, స్వతంత్రంగా ఉంటే అవగాహనతో వేరే కాస్ట్‌ వారిని పెళ్లి చేసుకుంటారని భయం. వచ్చేవాడు మంచోడు కాదని తెలిసినా సొంత కాస్ట్‌లోనే వారినే పెళ్లి చేసుకోవాలి. కొట్టినా, తిట్టినా వాడితోనే కాపురం చేయాలి. ఇలాంటి దౌర్భాగ్య స్థితిలో నేటితరం అమ్మాయిలు ఉన్నారు. అమ్మాయిలు యుఎస్‌, యుకె ఎక్కడికైనా వెళ్లండి... చదవండి.. ఆర్థికంగా నిలదొక్కుకోండి.. స్వతంత్రంగా ఉండడం మీద దృష్టి పెట్టండి. ఇలాంటి వెధవల్ని పెళ్లి చేసుకోవడానికి కోట్లు కట్నం ఇచ్చి అమెరికాలో నరకం అనుభవించే కన్నా.. సింగిల్‌గా ఉండడం మేలు. మన భాష అబ్బాయినే చేసుకోవాలని లేదు.. మంచి అబ్బాయి ఏ భాష వాడైనా పర్లేదు’’ అని పోస్ట్‌ చేసింది చిన్నయి. 


ఈ  స్టోరీస్‌ చూసి కొంతమంది అమ్మాయిలైనా కట్నం ఇవ్వను అని నిర్ణయించుకుంటే అది నాకు చాలు. అవగాహన కల్పిస్తుంటే  మనుషులకు కోపం వస్తుంది. బాలికల నుంచి సతీ సహగమనం లాంటి చెత్త సాంప్రదాయాలను మార్చేందుకు చూసిన ప్రతిసారీ ఇలాంటి కోపాన్నే ప్రదర్శించారు. అందరు అబ్బాయిలు తమ సోదరీమణులకు ఇలానే చేస్తారా? చేయనంటే వారంతా నాతో అంగీకరించినట్టే. మిగిలిన వాళ్లకు కోపం వేస్త  తెచ్చుకోండి. మీ ఈగోలను సాటిస్‌ఫ: చేసి మిమ్మల్ని కూల్‌ చేసేందుకు నేను ఇవన్నీ మాట్లాడడం లేదు’’ అని చిన్మయి పేర్కొన్నారు. 




Updated Date - 2021-12-06T19:41:28+05:30 IST