నా కంటికి ఇంకా చిన్న పిల్లలే

Twitter IconWatsapp IconFacebook Icon
నా కంటికి ఇంకా చిన్న పిల్లలే

మీరెన్ని విజయాలైనా అందుకుని ఉండొచ్చు. ఎన్నో మైలు రాళ్లు దాటేసి ఉండొచ్చు.కానీ మీ పిల్లలు.. ఓ చిన్న విజయం సాధిస్తే - సంబరపడిపోతారు. అప్పటి వరకూ మీరు సాధించిన విజయాలన్నీ.. దాని ముందు చిన్నవైపోతాయి.ఆ క్షణమే ఓ అద్భుతంగా తోస్తుంది.

జీవితా రాజశేఖర్‌ ఇప్పుడు అలాంటి అద్భుతమైన క్షణాలనే ఆస్వాదిస్తున్నారు. తన కుమార్తె శివాని ‘అద్భుతం’ సినిమా ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. కుమార్తె తొలి అడుగులోనే నిరూపించుకుందన్న ఆనందంలో ఉన్న ఆమె తన మనసులోని భావాలను నవ్యతో పంచుకున్నారిలా...


‘అద్భుతం’ ఫలితం... ఈ సినిమాపై వస్తున్న స్పందన చూస్తుంటే ఎలా అనిపిస్తుంది ? 

శివాని: నిజంగా అద్భుతంగా వుంది. మొదటి రెండు రోజులు నాకేం అర్థం కాలేదు. ట్విట్టర్‌ ఫేస్‌ బుక్‌, ఇస్ట్రా .. ఇలా అన్నీ సోషల్‌ మీడియా వేదికలపై సినిమా గురించి అందరూ అద్బుతంగా మాట్లాడుతున్నారు. ప్రతి రోజు సినిమా గురించి  మెేసజులు వస్తున్నాయి. మేము ఓ కొత్త తరహా సినిమా తీయడానికి ప్రయత్నించామని తెలుసు. కానీ ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో అనే భయం వుండేది. అందులోనూ నాకిది మొదటి సినిమా. చాలా ఒత్తిడిని గురయ్యా. కానీ  ప్రేక్షకులు అద్భుతంగా రిసీవ్‌ చేసుకున్నారు. మాకంటే వాళ్లే సినిమాని ఎక్కువగా ప్రమోట్‌ చేస్తున్నారు. ఫుల్‌ హ్యాపీ.


ఒక తల్లిగా మీ కుమార్తె విజయం ఎలా అనిపించింది ? 

జీవిత: శివాత్మిక, శివాని.. వీళ్ళిద్దరూ సినిమాలో నటిస్తామని చెప్పిన దగ్గర నుంచి నాకు టెన్షన్‌ పట్టుకుంది. ఎందుకంటే సినీ కెరీర్‌లో సక్సెస్‌ని ఎవరూ అంచనా వేయలేరు. ప్రతిభ, పలుకుబడి ఉన్నప్పటికీ ఇక్కడ విజయం అంత తేలిక కాదు. ఎలాంటి సినిమాలు వస్తాయో తెలీదు. ఎలాంటి సినిమా విజయం అవుతుందో చెప్పలేం. ఫలనా నగ కావాలంటే ఏదోరకంగా కొని ఇవ్వచ్చు కానీ సినిమా కెరీర్‌ మన చేతిలో వుండదు. అందుకే మొదటి నుంచి భయం. శివాత్మిక దొరసాని విడుదలైనప్పుడు కూడా చాలా టెన్షన్‌ పడ్డా. దానికి మంచి రివ్యూలు వచ్చాయి. శివాత్మిక నటన గురించి ప్రశంసలు దక్కాయి. ఆ రకంగా హ్యాపీ. శివాని విషయానికి వచ్చేసరికి మొదట అనుకున్న రెండు సినిమాలు కొన్ని కారణాల వల్ల ఆగిపోయాయి. ‘అద్భుతం’ మూడో సినిమా. దీనికి కూడా రెండు లాక్‌ డౌన్లు అడ్చొచ్చాయి. సినిమా ఎప్పుడు బయటికి వస్తుందా అనే టెన్షన్‌ వుండేది. ఫైనల్‌ గా సినిమా రిలీజ్‌ అయింది. ఈ సినిమాపై నాకూ మొదటి నుంచి నమ్మకం వుంది. ప్రేక్షకులకు కూడా నచ్చింది. శివాని నటన గురించి మాట్లాడుకుంటుంటే ఓ తల్లిగా అంతకంటే సంతోషం ఏముంటుంది;

  

మీ మొదటి సినిమాకి కూడా ఇలానే టెన్షన్‌ పడ్డారా ? 

జీవిత: అస్సలు లేదు. నేను చాలా యాక్సిడెంటల్‌గా సినీ పరిశ్రమకి వచ్చా. వచ్చినప్పుడు ఎలాంటి ఇమేజ్‌ లేదు. ఏదీ ప్లాన్‌ చేసుకోలేదు. ఈ రోజుకి  కూడా పెద్దగా ఏం ప్లాన్‌ చేసుకోను. 


వారస్వత్వాన్ని ఒత్తిడిగా ఫీలయ్యారా ? 

శివాని: మొదటి ఏం అనిపించలేదు. కానీ సినిమా విడుదలకు ముందు రోజు చాలా భయం వేసింది. అసలు ప్రేక్షకులు ఏం అంటారో, ఎలా స్పందిస్తారో అనే భయం.. ఎందుకంటే బాగాలేదని అంటే నా కన్నా మమ్మీ డాడీ ఎక్కువ  బాధపడతారు. కానీ ఇప్పుడు హ్యాపీ. సినిమా బావుంది. నా నటన కూడా ప్రేక్షకులకు నచ్చింది. చాలా ఆనందంగా వుంది. 


మొదటిసారి కెమెరా ముందుకు వచ్చినపుడు ఎలా అనిపించింది ? 

శివాని: చిన్నప్పటినుంచి సినిమా అంటే పిచ్చి. అమ్మానాన్నల సినిమాలు చూస్తూ పెరిగా. మొదటిసారి కెమెరా ముందుకు వచ్చినపుడు ‘ఫైనల్‌ గా నా ప్లేస్‌ కి వచ్చా’ననిపించింది. 


ఇప్పుడు శివానిని చూస్తున్నపుడు ఎలా అనిపి స్తుంది ? 

జీవిత: తల్లితండ్రులకు పిల్లలు ఎప్పటికీ పిల్లల్లానే కనిపిస్తారు.. ఇప్పుడూ నాకు చిన్నపిల్లలానే వుంది. చిన్నప్పటినుంచి సినిమా వాతావరణంలో పెరిగారు. వాళ్ళు ఎలా యాక్ట్‌ చేస్తారో అనే భయం అయితే లేదు కానీ లుక్‌ పరంగా చిన్న టెన్షన్‌ వుండేది. మానిటర్‌ చూసినప్పుడు ఆ టెన్షన్‌ కూడా పోయింది. వాళ్ళుకు నచ్చిన పని వాళ్ళు చేస్తున్నారు. తల్లితండ్రులకు ఇంతకంటే ఏం కావాలి. 


మీ అమ్మగారి సినిమాలు చూశారా ? 

శివాని: అన్నీ చూశాను. ఆహుతి, అంకుశం, తలంబ్రాలు.. ఈ మూడైతే లెక్కలేనన్ని సార్లు చూశాను. 


ఒక తల్లిగా, నటిగా .. మీ అమ్మగారి బలాలు ఏంటి ? 

శివాని: అద్భుతమైన అమ్మ. మా అందరికీ బ్యాక్‌ బోన్‌. నటిగా అయితే అమ్మ కళ్ళు నాకు బాగా నచ్చుతాయి. ఆమె కళ్ళల్లోనే బోలెడు ఎక్స్‌ ప్రెషన్స్‌ వుంటాయి.


శివాత్మికలో స్ర్టాంగ్‌ పాయింట్స్‌ చెప్పాలంటే ? 

శివాని: నిజం చెప్పాలంటే నాకంటే తను ఫిజికల్‌ గా స్ర్ట్టాంగ్‌ వుంటుంది (నవ్వుతూ). తనకు భాషపై మంచి పట్టుంది. కొత్త  భాషలు ఈజీగా నేర్చుకుంటుంది. 


శివాత్మిక, శివానిలో స్ర్టాంగ్‌ పాయింట్స్‌ తల్లిగా మీరు చెప్పండి?

జీవిత: ఇద్దరూ స్ట్రాంగ్‌. ఇద్దరికీ మంచి గ్రాస్పింగ్‌ పవర్‌ వుంది. ఏదైనా తేలిగ్గా నేర్చుకుంటారు. అయితే శివాత్మిక మాత్రం పర్శనల్‌ గా కొంచెం స్ట్రాంగ్‌. ఏది జరిగీనా తీసుకోగలదు. శివాని కొంచెం సెన్స్‌టీవ్‌. 


శివానిలో మీకు నచ్చిన విషయాలేంటి?  

జీవిత: తన స్ర్కీన్‌ ప్రజన్స్‌ సూపర్‌ . శివాని కామెడీ టైమింగ్‌ బావుటుంది. నా స్ర్టాంగ్‌ పాయింట్స్‌ గురించి అఢిగితే.. చాలా తక్కువ మాటల్లో ఒక మెేసజ్‌ని కన్వే చేయగలను. 


(నవ్వుతూ) . 

యాక్టింగ్‌ స్కూల్స్‌ కి వెళ్ళారా ? 

శివాని: చిన్నప్పటి నుంచి మమ్మీడాడీని చూసి పెరిగాం. అదే గ్రేట్‌ లెర్నింగ్‌ ఎక్స్‌ పిరియన్స్‌ 

స్టార్స్‌ పిల్లల్ని లాంచ్‌ చేేస ముందు చాలా ప్రిపేర్‌ చేయిస్తున్నారు.. మీరు ఎలా ప్రిపేర్‌ అయ్యారు ?


జీవిత: నిజమే. యాక్టింగ్‌ స్కూల్స్‌ లో చేర్పించడం, స్పెషల్‌ ట్రైనింగ్‌ ఇవ్వడం చేస్తారు. కానీ నాకు అలా కుదరలేదు. రాజశేఖర్‌ గారి పనుల్లో నేను ఎప్పుడూ బిజీగా వుండేదాన్ని. స్పెషల్‌ ఫోకస్‌ తీసుకునే సమయం వుండేది కాదు. కానీ వాళ్ళు చాలా తెలివైన పిల్లలు. వారికి నచ్చినది చేయడానికి మాత్రం నేను ఎప్పుడూ అడ్డుచెప్పలేదు. చదువు కూడా వారికి నచ్చిందే చదివారు. అయితే యాక్టింగ్‌ కెరీర్‌ స్టార్ట్‌ చేస్తామనే ఆలోచన వచ్చినపుడు.. ‘నటన అనేది లైమ్‌ లైట్‌లో ఉన్నంత వరకే. అకాడమిక్స్‌ ని నిర్లక్ష్యం చేయకూడద’ని చెప్పాం.. శివాత్మిక నిట్‌ రాసింది. శివాని మెడిసిన్‌ థర్డ్‌ ఇయర్‌. ఇటు చదువుని అటు నటనని చక్కగా మ్యానేజ్‌ చేస్తున్నారు. 


అద్భుతం సినిమా చూశాక మీ ేస్నహితుల రియాక్షన్‌ ? 

శివాని: వాళ్ళంతా చాలా హ్యాపీ. అందరూ కంగ్రాట్స్‌ చెబుతూ మెేసజులు పెట్టారు. ఫ్రెండ్స్‌ అంతా కలసి ఒక సర్ర్పైజ్‌ పార్టీ ప్లాన్‌ చేస్తున్నారు.   


అమ్మ స్ర్టిక్ట్‌గా ఉంటారా ? 

శివాని: లేదు. అమ్మ మా బెస్ట్‌ ఫ్రెండ్‌. మేము అన్నీ అమ్మకి చెప్పేస్తాం. అప్పుడప్పుడు డాడీ కొంచెం స్ర్టిక్ట్‌గా వుంటారేమో గానీ మమ్మీ వెరీ ఫ్రెండ్లీ. 


అమ్మపై కోపం ఎప్పుడైనా వచ్చిందా ? 

శివాని: అమ్మపై కోపం కామన్‌.  కొట్టుకోవడం తిట్టుకోవడం అన్నీ వుంటాయి (నవ్వుతూ). కానీ అమ్మకి మా మీద కోపం వేస్త మాత్రం చాలా వెరైటీ రియాక్షన్‌ ఇస్తుంది. ‘ఇలా పెంచడం నా తప్పు.. నా బుద్ది తక్కువ’ అని తనని తానే కొట్టుకుంటుంది (నవ్వుతూ). చాలా స్వీట్‌ హార్ట్‌. 


పిల్లలపై కోపం వస్తుందా ? 

జీవిత: చిన్నచిన్న కోపాలు కామన్‌గా వుంటాయి. అయితే మా నలుగురిలో కోపం కారణంగా రెండుమూడు రోజులు మాట్లాడకుండా వుంటే మాత్రం నేను ఊరుకోను. ఏదైనా వుంటే వెంటనే ‘సారీ’ చెప్పి కలసిపోవాల్సిందే. అయితే మేము చాలా లక్కీ.. మా పిల్లల ఆలోచన విధానం బాగుంటుంది. చాలా మెచ్యూర్‌ గా ఆలోచిస్తారు.


ఇంట్లో వీటో పవర్‌ ఎవరికి వుంటుంది ? 

జీవిత: రాజశేఖర్‌ గారికి. థర్డ్‌ ఎంపైర్‌ ఆయనే. ఆయన పిల్లల పట్ల చాలా కేరింగ్‌ గా వుంటారు. చక్కగా మాట్లాడతారు. ఏదీ కూడా పిల్లలపై రుద్దరు.


సినీ కెరీర్‌లో సక్సెస్‌ ని ఎవరూ అంచనా వేయలేరు. ప్రతిభ, పలుకుబడి ఉన్నప్పటికీ ఇక్కడ విజయం అంత తేలిక కాదు. ఎలాంటి సినిమాలు వస్తాయో తెలీదు. ఎలాంటి సినిమా విజయం అవుతుందో చెప్పలేం. ఫలనా నగ కావాలంటే ఏదోరకంగా కొని ఇవ్వచ్చు కానీ సినిమా కెరీర్‌ మన చేతిలో వుండదు.


                                                                                            సీవీఎల్‌ఎన్‌ ప్రసాద్‌

నా కంటికి ఇంకా చిన్న పిల్లలే

మా నలుగురిలో కోపం కారణంగా రెండుమూడు రోజులు మాట్లాడకుండా వుంటే మాత్రం నేను ఊరుకోను. ఏదైనా వుంటే వెంటనే ‘సారీ’ చెప్పి కలసిపోవాల్సిందే. అయితే మేము చాలా లక్కీ.. మా పిల్లల ఆలోచన విధానం బాగుంటుంది. చాలా మెచ్యూర్‌ గా ఆలోచిస్తారు.

AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

మీకు తెలుసా !..Latest Telugu Cinema Newsమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.