తమిళ తెరపై ‘సిండ్రెల్లా‘గా మన ‘రత్తాలు‘!

ABN , First Publish Date - 2021-09-24T16:32:00+05:30 IST

అనూహ్యంగా నెత్తిన పడ్డ కరోనా అన్ని రంగాల్లాగే కోలీవుడ్‌ను కూడా తీవ్రంగా దెబ్బతీసింది. సినిమాలంటే ప్రాణాలిచ్చే తంబీలు చాలా నెలలుగా థియేటర్స్‌ వైపు వెళ్లలేకపోయారు. అయితే, గత కొన్ని వారాలుగా తమిళనాడులోనూ పరిస్థితులు మెరుగవుతున్నాయి. దాంతో బాక్సాఫీస్ వద్ద సినిమాల సందడి పెరిగిపోయింది.

తమిళ తెరపై ‘సిండ్రెల్లా‘గా మన ‘రత్తాలు‘!

అనూహ్యంగా నెత్తిన పడ్డ కరోనా అన్ని రంగాల్లాగే కోలీవుడ్‌ను కూడా తీవ్రంగా దెబ్బతీసింది. సినిమాలంటే ప్రాణాలిచ్చే తంబీలు చాలా నెలలుగా థియేటర్స్‌ వైపు వెళ్లలేకపోయారు. అయితే, గత కొన్ని వారాలుగా తమిళనాడులోనూ పరిస్థితులు మెరుగవుతున్నాయి. దాంతో బాక్సాఫీస్ వద్ద సినిమాల సందడి పెరిగిపోయింది. ఈ వారం అయిదు చిత్రాలు పోటాపోటీగా జనం ముందుకొస్తున్నాయి. మరీ బిగ్ స్టార్స్ లేనప్పటికీ, ఎంతో కాలంగా వాయిదాపడుతూ వస్తోన్న చిన్న చిత్రాలు, మూకుమ్ముడిగా విడుదలైపోతున్నాయి.


‘ప్లాన్ పన్ని పన్ననుమ్’... ఇదో కామెడీ ఎంటర్టైనర్. రియో రాజ్, బాలా శరవణన్ హీరోలు. రమ్య నంబీశన్ హీరోయిన్. సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల జీవితాల నేపథ్యంలో సినిమా కథ సాగుతుంది. బద్రి వెంకటేశ్ దర్శకత్వం వహించారు.


‘సిండ్రెల్లా’... ఇది ఫ్యాంటసీ మూవీ. అయితే, ఇందులో తెలుగు వారికి కూడా బాగా తెలిసిన రాయ్ లక్ష్మీ టైటిల్ రోల్ చేసింది. మెగాస్టార్ ‘రత్తాలు‘గా చిందులేసిన ఐటెం బ్యూటీ ‘సిండ్రెల్లా‘ సినిమాలో మాత్రం మూడు డిఫరెంట్ లుక్స్‌తో ఎంటర్టైన్ చేయనుంది. ఈ సినిమాకి కొత్త దర్శకుడు వినోద్ వెంకటేశ్ సారథ్యం వహించారు.


‘ఛూ మంతిరకాళీ’... ఇది కూడా కామెడీ ఎంటర్టైనరే. అందరు కొత్తవాళ్లే నటించిన ఈ మూవీలో కార్తికేయన్ వేలు హీరో కాగా సంజన బుర్లీ హీరోయిన్. దర్శకుడు ఈశ్వర్. 


‘పెయ్ మామ‘... ఈ సినిమా హారర్ కామెడీ జానర్‌లో అలరించనుంది. ఈ మధ్య తెలుగులో కూడా పాప్యులర్ అవుతోన్న కోలీవుడ్ స్టార్ కమెడియన్ యోగి బాబు ఇందులో కీలక పాత్ర పోషించారు. ఓ జేబు దొంగ ఒకానొక దెయ్యాల కుటుంబానికి ఏ విధంగా సాయపడ్డాడనేది, హిలేరియస్‌గా, డైరెక్టర్ శక్తి చిదంబరం చూపించారు.  


‘చిన్నన్‌జిరు కిలియే‘... కోలీవుడ్‌లో ఈ వారం బాక్సాఫీస్ వద్దకొచ్చిన సినిమాలన్నిటిలో, సీరియస్‌గా సాగే మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ, ఇదొక్కటి మాత్రమే. మన సంప్రదాయ భారతీయ విద్యా, వైద్యం గొప్పతనం చెప్పే ప్రయత్నం చేశారు ఈ సినిమాలో. అదే సమయంలో వెస్ట్రన్ మెడిసిన్, ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో ఉన్న లోపాల్ని ఎత్తి చూపేలా సినిమా రూపొందించారు దర్శకుడు శబరినాథన్. సెంథిల్‌నాథన్, శాండ్రా నాయర్, అర్చనా సింగ్ కీ రోల్స్ ప్లే చేశారు.

Updated Date - 2021-09-24T16:32:00+05:30 IST