'చతుర్ ముఖం' ట్రైలర్ విడుదల

ABN , First Publish Date - 2021-08-11T17:13:10+05:30 IST

మలయాళ హిట్ మూవీ 'చతుర్ ముఖం' తెలుగు ట్రైలర్ విడుదలయింది. ఈ మధ్య మలయాళ చిత్రాలు తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుంటున్నాయి. మన టాలీవుడ్ స్టార్స్ కూడా మలయాళ హిట్ సినిమా రీమేక్ రైట్స్ కొని తెలుగులో రీమేక్ చేస్తున్నారు.

'చతుర్ ముఖం' ట్రైలర్ విడుదల

మలయాళ హిట్ మూవీ 'చతుర్ ముఖం' తెలుగు ట్రైలర్ విడుదలయింది. ఈ మధ్య మలయాళ చిత్రాలు తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుంటున్నాయి. మన టాలీవుడ్ స్టార్స్ కూడా మలయాళ హిట్ సినిమా రీమేక్ రైట్స్ కొని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. వీటిలో చిన్న సినిమా నుంచి, 'అయ్యప్పనుం కోషియం', 'లూసీఫర్' వంటి భారీ చిత్రాలున్నాయి. 'ఏకే' తెలుగు రీమేక్‌లో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ - రానా దగ్గుబాటి నటున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుకుంటోంది. ఇక త్వరలో 'లూసీఫర్' రీమేక్ మూవీతో మెగాస్టార్ సెట్స్ మీదకి రానున్నారు. అలాగే కొన్ని చిన్న బడ్జెట్ సినిమాలు డబ్ చేసి ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు.


ఇదే క్రమంలో మరో మలయాళ చిత్రం ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహా వేదికగా విడుదల అయ్యేందుకు సిద్ధమయింది. మంజు వారియర్‌, సన్నీ వెనె, శ్రీకాంత్‌ మురళి ప్రధానపాత్రలు పోషించిన 'చతుర్ముఖం' ఏప్రిల్‌లో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాక, విమర్శకుల ప్రశంసలూ అందుకుంది. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ బ్యాక్ డ్రాప్‌లో రంజిత్ కామ‌ల శంక‌ర్‌ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. తెలుగు ప్రేక్షకుల కోసం 'ఆహా'లో ఈ నెల 13 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఎంతో ఉత్కంఠభరితంగా సాగుతున్న ఈ ట్రైలర్ బాగానే ఆకట్టుకుంటోంది.



Updated Date - 2021-08-11T17:13:10+05:30 IST