హాట్ సీట్‌లో చరణ్..!

ABN , First Publish Date - 2021-07-16T14:30:21+05:30 IST

స్మాల్ స్క్రీన్‌పై అలరించబోతోన్న పాపులర్ షో 'ఎవరు మీలో కోటీశ్వరులు'. దీనికి ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యహరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ షోకి సంబంధించిన షూటింగ్‌లో పాల్గొంటున్నారు ఎన్టీఆర్. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ఈ షో చిత్రీకరణ జరుగుతోంది.

హాట్ సీట్‌లో చరణ్..!

స్మాల్ స్క్రీన్‌పై అలరించబోతోన్న పాపులర్ షో 'ఎవరు మీలో కోటీశ్వరులు'. దీనికి ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యహరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ షోకి సంబంధించిన షూటింగ్‌లో పాల్గొంటున్నారు ఎన్టీఆర్. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ఈ షో చిత్రీకరణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా 'ఎవరు మీలో కోటీశ్వరులు' షో గురించి ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పాపులర్ షోకు ఫస్ట్ గెస్ట్‌గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రానున్నట్టు తెలుస్తోంది. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మకమైన చిత్రం 'ఆర్ఆర్ఆర్'లో చరణ్ - ఎన్టీఆర్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే.'ఆర్ఆర్ఆర్' మొదలయ్యాక ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. ఈ కారణంగానే షోకు ఫస్ట్ గెస్ట్‌గా చరణ్‌ను ఆహ్వానిస్తున్నట్టు సమాచారం. ఇందులో వాస్తవం ఎంతనేది తెలియనప్పటికి అభిమానుల్లో, ప్రేక్షకుల్లో మాత్రం ఉత్సాహం రెట్టింపు అయింది. కాగా త్వరలో దీని ప్రోమోను రిలీజ్ చేసేందుకు నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. 

Updated Date - 2021-07-16T14:30:21+05:30 IST