చరణ్ ముందుకు విజయ్ వెనక్కి..?

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియన్ సినిమా పుష్ప: ది రైజ్ పార్ట్ 1 ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ సక్సెస్ అందుకుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి దీని సీక్వెల్ మూవీ కూడా సెట్స్ మీదకు రాబోతోంది. అయితే, ఇటీవల సుకుమార్.. చరణ్‌తో నెక్స్ట్ సినిమా చేయబోతున్నట్టు వెల్లడించాడు. ఇంతకముందు సుకుమార్, రామ్ చరణ్ కాంబినేషన్‌లో వచ్చిన 'రంగస్థలం' ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో తెలిసిందే. ఇప్పుడు 'పుష్ప పార్ట్ 2' తర్వాత మళ్ళీ ఇదే కాంబినేషన్ రిపీటవుతుందనగానే అది 'రంగస్థలం' సీక్వెలే అయుంటుందని చెప్పుకుంటున్నారు. సుక్కూ కూడా అదే ప్రయత్నాలు చేస్తున్నారట. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండతో సుకుమార్ చేయాల్సిన ప్రాజెక్ట్ మొదలవడానికి ఇంకా చాలా సమయం పడుతుందని అర్థమవుతోంది. గత ఏడాదే సుక్కూ, విజయ్ దేవరకొండ కాంబినేషన్ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించారు. కరోనా వేవ్స్ వల్ల ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ఇప్పుడు చరణ్ ముందుకు రావడంతో విజయ్ దేవరకొండ వెనక్కి తగ్గాల్సి వస్తుందని టాక్ మొదలైంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.  

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.