ఆ ప్రకటనలో నటించినందుకు Akshay Kumar సినిమాని Boycott చేసిన ప్రేక్షకులు.. Samrat Prithviraj దర్శకుడి రియాక్షన్ ఇదే..

ABN , First Publish Date - 2022-06-23T18:01:23+05:30 IST

బాలీవుడ్‌లోని స్టార్ హీరోల్లో అక్షయ్ కుమార్ ఒకరు. ఈ స్టార్ ప్రతి సంవత్సరం రెండు, మూడు సినిమాల ద్వారా ప్రేక్షకులని పలకరిస్తూ ఉంటాడు...

ఆ ప్రకటనలో నటించినందుకు Akshay Kumar సినిమాని Boycott చేసిన ప్రేక్షకులు.. Samrat Prithviraj దర్శకుడి రియాక్షన్ ఇదే..

బాలీవుడ్‌లోని స్టార్ హీరోల్లో అక్షయ్ కుమార్ ఒకరు. ఈ స్టార్ ప్రతి సంవత్సరం రెండు, మూడు సినిమాల ద్వారా ప్రేక్షకులని పలకరిస్తూ ఉంటాడు. అక్షయ్ తాజాగా నటించిన హిస్టారికల్ మూవీ ‘సామ్రాట్ పృథ్వీరాజ్’. ఇటీవలే విడుదలైన ఈ సినిమా మంచి టాక్‌ సొంతం చేసుకున్నప్పటికీ.. కలెక్షన్ల పరంగా మాత్రం వెనుకబడింది. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా.. టోటల్ రన్‌లో కేవలం రూ.80కోట్లు మాత్రమే రాబట్టగలిగింది. అక్షయ్ పాన్ మాసాలా యాడ్‌‌లో నటించడం వల్ల ఈ చిత్ర విడుదలకి ముందు బాయ్‌కాట్ సామ్రాట్ పృథ్వీరాజ్ బాగా ట్రెండ్ అవ్వడం ఈ మూవీపై బాగా ప్రభావం చూపింది. దీని గురించి ఈ మూవీ డైరెక్టర్ చంద్రప్రకాశ్ ద్వివేది ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


ద్వివేది మాట్లాడుతూ.. ‘అక్షయ్ సార్ తన కుమారుడిని పృథ్వీరాజ్ చౌహాన్ గురించి అడిగినప్పుడు.. ఆయన ఎవరో తనకు తెలియదని సమాధానమిచ్చాడు. అది అక్షయ్‌ని ఆలోచనలో పడేసింది. అప్పటి నుంచి ‘హిందూ చరిత్ర’ గురించి మనం ఎందుకు చెప్పట్లేదని విచారించడం ప్రారంభించాడు. ఈ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలను చెప్పడం వల్ల సామ్రాట్ పృథ్వీరాజ్‌ను చారిత్రక చిత్రంగా ప్రేక్షకులు భావించారు. అయితే.. మేం ఎప్పుడూ ఇది చారిత్రాత్మక చిత్రం అని ఎప్పుడూ చెప్పలేదు. కానీ ఆడియన్స్‌కి అలా రీచ్ అయ్యింది’ అని చెప్పుకొచ్చాడు.


ద్వివేది ఇంకా మాట్లాడుతూ.. ‘నచ్చకపోతే సినిమాని, నటుడిని తిరస్కరించే హక్కు ప్రేక్షకులకి ఉంటుంది. కానీ.. అక్షయ్ దాదాపు 30 సంవత్సరాలుగా నటిస్తున్నాడు. ఆయన సామర్థ్యం ఎంటోం అందరికీ తెలుసు. ఆయన తన శక్తి మేరకు ఆ పాత్రలో నటించాడు. నటుడిగా ప్రేక్షకులు ఇష్టపడనివారిలో అక్షయ్ ఫస్ట్ కాదు. అయితే.. పృథ్వీరాజ్‌ వంటి సినిమాను రిజెక్ట్ చేయడంలో అర్థం లేదు. అక్షయ్ ఇంతకుముందు పాన్ మసాలాను ప్రచారం చేశాడు. శివ లింగానికి పాలు పోయకూడదని చెప్పాడు. కానీ.. సినిమాకి సంబంధంలేని విషయాలను పరిగణలోకి తీసుకొని ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేయడం బాధాకరం.


సినిమా చేసేటప్పుడు మొఘలులా గురించి చూపకపోవడంపై నేను ఆందోళన చెందాను. ఆశ్చర్యం ఏంటంటే సినిమాకు అన్ని వైపుల నుంచి వ్యతిరేకత వచ్చింది. ఘోరీ చేసిన అఘాయిత్యాలను నేను ఎందుకు చూపించలేదని, సంయోగితాపై అత్యాచారం, గోవులు, బ్రాహ్మణుల వధ వంటి వాటిని ఎందుకు చూపించలేదు అని చాలా మంది ప్రశ్నించారు. పృథ్వీరాజ్ గురించి రాసిన కవిత Prithviraj Rasoలో ఇలాంటి వన్నీ ఎక్కడ రాశారు. ఈ విషయాన్ని నన్ను ప్రశ్నించే వర్గం ప్రేక్షకులను నేను అడగుతున్నాను. ఈ సంఘటనలేవీ కవితలో ప్రస్తావించలేదు. ఇంటర్నెట్‌లో చాలా తప్పుడు సమాచారం ఉంది’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు.

Updated Date - 2022-06-23T18:01:23+05:30 IST