‘బంగార్రాజు’లో రంభ!

ABN , First Publish Date - 2021-09-26T05:30:00+05:30 IST

నాగార్జున, నాగచైతన్య హీరోలుగా నటిస్తున్న సోషియో ఫాంటసీ సినిమా ‘బంగార్రాజు’. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది.

‘బంగార్రాజు’లో రంభ!

నాగార్జున, నాగచైతన్య హీరోలుగా నటిస్తున్న సోషియో ఫాంటసీ సినిమా ‘బంగార్రాజు’. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. స్వర్గంలో రంభ, ఊర్వశి, మేనకతో బంగార్రాజు ముద్దుముచ్చట్లలో మునిగే సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఇందులో రంభగా నటించే ఛాన్స్‌ వేదిక అందుకున్నారని తెలిసింది. ఊర్వశిగా మీనాక్షీ దీక్షిత్‌, మేనకగా దర్శిని కనిపించనున్నారట. కల్యాణ్‌కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నాగార్జునకు జంటగా రమ్యకృష్ణ, నాగచైతన్యకు జోడీగా కృతీశెట్టి నటిస్తున్నారు.

Updated Date - 2021-09-26T05:30:00+05:30 IST