నా దృష్టిలో ఏ సినిమా ఫ్లాప్ కాదు: చేతన్ భరద్వాజ్

ABN , First Publish Date - 2021-08-10T01:42:32+05:30 IST

‘ఆర్ఎక్స్ 100’ చిత్రంలోని పిల్లారా సాంగ్‌తో మ్యూజిక్ డైరెక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగీత దర్శకుడు చేతన్ భరద్వాజ్. ఆయన సంగీత సారథ్యంలో రూపొంది, రీసెంట్‌గా విడుదలైన చిత్రం ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’. కిరణ్ అబ్బవరం

నా దృష్టిలో ఏ సినిమా ఫ్లాప్ కాదు: చేతన్ భరద్వాజ్

‘ఆర్ఎక్స్ 100’ చిత్రంలోని పిల్లారా సాంగ్‌తో మ్యూజిక్ డైరెక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగీత దర్శకుడు చేతన్ భరద్వాజ్. ఆయన సంగీత సారథ్యంలో రూపొంది, రీసెంట్‌గా విడుదలైన చిత్రం ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’. కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ చిత్రానికి అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సాంగ్స్‌కు మంచి స్పందన వస్తున్నందుకు సంతోషంగా ఉందని తెలిపారు చేతన్ భరద్వాజ్. సోమవారం ఆయన మీడియాతో ముచ్చటించారు.


ఆయన మాట్లాడుతూ..

ఎస్ కళ్యాణమండపంలో మూడు డిఫ్రెంట్ సాంగ్స్‌కు కంపోజింగ్ చేయడం చాలా ఛాలెంజింగ్‌గా అనిపించింది. పాటలు విని సుకుమార్‌గారితో సహా చాలామంది ప్రముఖులు ఫోన్లు చేసి అభినందించారు. నేపథ్య సంగీతం కూడా బాగుందని ప్రశంసించారు. థియేటర్లకు ప్రేక్షకులు రావడంలో ఈ పాటలు దోహదపడ్డాయని అందరూ అంటుంటే చాలా సంతోషంగా అనిపించింది. ఇంతకు ముందు నేను చేసిన ‘ఆర్ఎక్స్100, గుణ369, మన్మథుడు 2, 7’ ఇలా ప్రతి సినిమా ఛాలెంజింగ్‌గా తీసుకొని దర్శకుడి అభిప్రాయం మేరకే మ్యూజిక్ ఇచ్చాను. ‘ఆర్ఎక్స్100’ నుండి ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ వరకు ఇప్పటివరకు నేను పనిచేసిన ప్రతిదీ నాకు ఛాలెంజింగ్ సినిమాయే. నా దృష్టిలో ఏ సినిమా ఫ్లాప్ కాదు. పరిస్థితులను బట్టి కొన్ని సినిమాలు ప్రేక్షకులకు కనెక్ట్ కావు. ఉదాహరణకి బాధలో ఉండే మనిషికి హ్యాపీగా ఉండే కంటెంట్ సినిమా చూపిస్తే నచ్చకపోవచ్చు, హ్యాపీగా ఉండే మనిషికి బాధగా ఉండే సినిమా నచ్చకపోవచ్చు.ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించలేము.


హీరో కిరణ్ ఆబ్బవరం సూచన మేరకు హీరో ఇంట్రడక్షన్ సీన్‌కు ఆల్ ఓల్డ్ సాంగ్స్ డి.జె. మిక్సింగ్ చేయడం జరిగింది. ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదంతా కిరణ్ ఐడియాలజీతో చేశాం. ఆ క్రెడిట్ అంతా కిరణ్‌కే చెందుతుంది. అలాగే సినిమాలోని పాటలు ఇంత పెద్ద హిట్ అవడానికి చిత్ర దర్శకుడు శ్రీధర్ గాదె, నిర్మాతలు ప్ర‌మోద్, రాజు, హీరో కిరణ్‌లే ప్రధాన కారణం. వీరిలో మంచి అభిరుచి ఉండడం వల్లనే పాటలతో పాటు సినిమా కూడా పెద్ద విజయం సాధించింది.


నా తదుపరి ప్రాజెక్ట్ అజ‌య్ భూప‌తి దర్శకత్వంలో ప్రామిసింగ్ యాక్ట‌ర్స్ శ‌ర్వానంద్‌, సిద్ధార్ద్‌లు నటిస్తున్న ‘మ‌హా స‌ముద్రం’ సినిమా చేస్తున్నాను. త్వరలో నేను చేయబోయే మరిన్ని ప్రాజెక్ట్స్ విశేషాలు తెలియజేస్తాను.

Updated Date - 2021-08-10T01:42:32+05:30 IST