తెలుగు వంటల్ని సెలబ్రేట్‌ చేసేలా...

ABN , First Publish Date - 2021-08-06T07:27:18+05:30 IST

‘‘తెలుగు భాషలో ఓ గొప్పదనం ఉంటుంది. తెలుగు వంటల్లో ఓ కమ్మదనం ఉంటుంది’’ అని తమన్నా అంటున్నారు. తెలుగు బుల్లితెరపై వంటల కార్యక్రమం ‘మాస్టర్‌ షెఫ్‌’కు ఆమె హోస్ట్‌ చేయనున్న...

తెలుగు వంటల్ని సెలబ్రేట్‌ చేసేలా...

‘‘తెలుగు భాషలో ఓ గొప్పదనం ఉంటుంది. తెలుగు వంటల్లో ఓ కమ్మదనం ఉంటుంది’’ అని తమన్నా అంటున్నారు. తెలుగు బుల్లితెరపై వంటల కార్యక్రమం ‘మాస్టర్‌ షెఫ్‌’కు ఆమె హోస్ట్‌ చేయనున్న సంగతి తెలిసిందే. త్వరలో ఇది ప్రసారం కానుంది. ఈ సందర్భంగా గురువారం ప్రచార చిత్రం విడుదల చేశారు. అందులో ‘‘నేను పుట్టింది ఎక్కడైనా కావచ్చు. కానీ, ప్రేమాభిమానాలను సొంతం చేసుకుంది తెలుగు పరిశ్రమలోనే. నన్ను ఇంతగా పాపులర్‌ చేసింది తెలుగు ప్రేక్షకులే. తెలుగు సినిమా నా జీవితంలో ఎలా ఓ భాగమో... అలాగే, తెలుగు వంటలు కూడా నా జీవితంలో ఓ భాగం అయిపోయాయి. ఎక్కడికి వెళ్లినా మన రాయలసీమ రుచుల్ని, కోస్తా పులుసుల్ని, తెలంగాణ దావత్‌లను మనం ఎప్పటికీ మరువలేం. అలాంటి తెలుగు వంటల్ని మన తెలుగు వారందరితో కలిసి ప్రపంచమంతా గుర్తించేలా సెలబ్రేట్‌ చేసుకునేందుకు సరైన వేదిక ‘మాస్టర్‌ షెఫ్‌’’ అని తమన్నా చెప్పారు.

Updated Date - 2021-08-06T07:27:18+05:30 IST