డీఎండీకే అధ్యక్షుడు, సీనియర్ సినీ నటుడు కెప్టెన్ విజయ కాంత్ సంపూర్ణ ఆరోగ్యంతో కనిపిస్తున్న పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన తాజాగా తన భార్య ప్రేమలత పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నారు. తన భర్త, ఇద్దరు కుమారులు ప్రభాకరన్, షణ్ముగపాండ్యన్ సమక్షంలో ప్రేమలత బర్త్‌డే కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోను డీఎండీకే పీఆర్వో మీడియాకు రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కాగా, ఇటీవల విజయ కాంత్‌కు సంబంధించిన ఫొటో ఒకటి బయటకు వచ్చింది. అందులో విజయ కాంత్ ముఖకవళికలు, రూపురేఖలు పూర్తిగా మారిపోయి కనిపించారు. ఈ ఫొటోను చూసిన ఆయన అభిమానులతో పాటు రాష్ట్ర ప్రజలు కూడా ఆశ్చర్యానికి లోనయ్యారు. కానీ, తాజాగా రిలీజ్ చేసిన ఫొటోల్లో విజయ కాంత్ సంపూర్ణ ఆరోగ్యంతో కనిపిస్తున్నారు. దీంతో ఆయన అభిమానులు కూడా ఎంతో ఆనందిస్తున్నారు.