Captain Miller: ఆకట్టుకుంటున్న కొత్త పోస్టర్..

Twitter IconWatsapp IconFacebook Icon
Captain Miller: ఆకట్టుకుంటున్న కొత్త పోస్టర్..

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) నటిస్తున్న లేటెస్ట్ మూవీస్ లో ఒకటి 'కెప్టెన్ మిల్లర్' (Captain Miller). తాజాగా ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్ ని మేకర్స్ వదిలారు. ధనుష్ బర్త్ డే సందర్భంగా జూలై 28న 'సార్' (Sir) సినిమా నుంచి ఫస్ట్ లుక్ టీజర్ ని వదిలిన సంగతి తెలిసిందే. ఇది తెలుగులో ఆయన నటిస్తున్న మొదటి స్ట్రైట్ సినిమా. తమిళంలో 'వాతి' (Vaathi) పేరురుతో రిలీజ్ అవుతోంది. ఇక తాజాగా వదిలిన టీజర్ అభిమానులను, ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రాన్ని వెంకీ అట్లూరి (Venky Atluri) తెరకెక్కిస్తున్నాడు. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. 

ఇక ఇదే క్రమంలో కెప్టెన్ మిల్లర్ నుండి కూడా ఇప్పుడు ఒక సరికొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ అనౌన్స్ మెంట్ వీడియో అందరినీ ఎంతోగానో ఆకట్టుకుంది. రెడ్ కలర్ బ్యాక్ గ్రౌండ్ లో గన్ పట్టుకుని యుద్ధం కోసం సిద్దమైన మిల్లర్ పాత్రలో ధనుష్ లుక్ ఆకట్టుకుంటోంది. ఇక ఈ సినిమా 1930-40 ల కాలంలో జరిగే పీరియాడిక్ డ్రామాగా రూపొందుతోంది. ఈ మూవీని టి త్యాగరాజన్ సమర్పణలో సత్యజ్యోతి ఫిలిమ్స్ పతాకంపై ఎంతో భారీగా నిర్మిస్తున్నారు. 

త్రిభాషా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శరవణన్, సాయి సిద్దార్థ నిర్మాతలు. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తుండగా, జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. కాగా, ఇటీవలే ధనుష్ నటించిన హాలీవుడ్ మూవీ దిగ్గజ ఓటీటీ 'ది గ్రే మ్యాన్' నెట్ ఫ్లిక్స్ లో రిలీజై మంచి టాక్ తో భారీ స్థాయిలో వ్యూస్ రాబడుతూ కొనసాగుతోంది. 

AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.