Sidhu Moose Wala: సిద్ధూ మూసే వాలాకు నివాళి అర్పించిన కెనడియన్ ర్యాపర్.. వైరల్‌గా మారిన వీడియో..

Twitter IconWatsapp IconFacebook Icon
Sidhu Moose Wala:  సిద్ధూ మూసే వాలాకు నివాళి అర్పించిన కెనడియన్ ర్యాపర్.. వైరల్‌గా మారిన వీడియో..

పంజాబీ గాయకుడు, ర్యాపర్ సిద్ధూ మూసే వాలా (Sidhu Moose Wala) రెండు నెలల క్రితం దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. కెనడియన్ ర్యాపర్ డ్రేక్ (Drake)  తాజాగా సిద్ధూకూ నివాళి అర్పించాడు. టోరెంటోలో జరిగిన ఓ కన్సర్ట్‌లో సిద్ధు బొమ్మతో కూడిన టీ-షర్ట్‌ను అతడు ధరించాడు. 


రాబోయే రోజుల్లో ఓవో ఫెస్ట్‌లో డ్రేక్ ప్రదర్శన ఇవ్వాలి. అందుకోసం అతడు రిహార్సల్స్ చేస్తున్నాడు. ముందుస్తుగా షోలు ఇస్తున్నాడు. ఈ షోలోనే అతడు సిద్ధుకు నివాళులు అర్పించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సిద్ధు అభిమానులందరూ ఆ వీడియోను విపరీతంగా షేర్ చేస్తున్నారు. ఆ వీడియో కింద అనేక మంది కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘‘డ్రేక్‌పై నాకు మరింత గౌరవం పెరిగింది’’ అని ఓ నెటిజన్ చెప్పాడు. ‘‘డ్రేక్, సిద్ధూ మూసేవాలా మధ్య ఉన్న బలమైన అనుబంధానికి ఈ వీడియో ప్రతీక’’ అని మరో నెటిజన్ పేర్కొన్నాడు. సిద్ధూ మూసే వాలా ఈ ఏడాది మేలో దారుణ హత్యకు గురయ్యాడు. సిద్ధును స్మరించుకుంటూ అతడి గౌరవార్థం డ్రేక్ అప్పట్లో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టాడు. సిద్ధూ మూసే వాలాను 2020నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో డ్రేక్ ఫాలో అవుతున్నాడు. కొన్ని రోజుల క్రితం కమెడియన్ కపిల్ శర్మ కూడా ఓ కన్సర్ట్‌లో సిద్ధుకు నివాళి అర్పించిన సంగతి తెలిసిందే.


AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.