తిప్పగలవా జయమ్మా..?!

ABN , First Publish Date - 2021-11-24T05:43:53+05:30 IST

బుల్లి తెర వ్యాఖ్యాత సుమ ప్రధాన పాత్రధారిగా తెరకెక్కుతున్న చిత్రం ‘జయమ్మ పంచాయితీ’. విజయకుమార్‌ కలివారపు దర్శకుడు. బలగ ప్రకాష్‌ నిర్మాత. ఈ చిత్రంలోని ‘తిప్పగలనా’ అనే పాటని...

తిప్పగలవా జయమ్మా..?!

బుల్లి తెర వ్యాఖ్యాత సుమ ప్రధాన పాత్రధారిగా తెరకెక్కుతున్న చిత్రం ‘జయమ్మ పంచాయితీ’. విజయకుమార్‌ కలివారపు దర్శకుడు. బలగ ప్రకాష్‌ నిర్మాత. ఈ చిత్రంలోని ‘తిప్పగలనా’ అనే పాటని ప్రముఖ కథానాయకుడు నాని విడుదల చేశారు.  పీవీఎస్‌ఎన్‌.రోహిత్‌ ఆలపించిన ఈ పాటను రామాంజనేయులు రచించారు. ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందించారు. గ్రామీణ నేపథ్యంలో సాగే కథ ఇది. జయమ్మగా సుమ నటన, ఆమెపై తెరకెక్కించిన సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని చిత్రబృందం తెలిపింది. ‘‘కీరవాణి బాణీలన్నీ ఆకట్టుకుంటాయి. విజువల్స్‌ కూడా అద్భుతంగా వస్తున్నాయి. షూటింగ్‌ దాదాపుగా పూర్తయ్యింది. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తామ’’న్నారు దర్శకుడు. దేవీ ప్రసాద్‌, దినేష్‌, షాలినీ తదితరులు నటిస్తున్నారు.


Updated Date - 2021-11-24T05:43:53+05:30 IST