ఏపీ ప్రభుత్వ నిర్ణయంతో ఎవరూ సంతోషంగా లేరు: సి. కల్యాణ్

ABN , First Publish Date - 2021-12-09T01:54:04+05:30 IST

‘నా వస్తువుని నేను తయారు చేసుకుని, నేనే రేటు ఫిక్స్ చేసుకుంటాను. ఆ వస్తువును కొనాలా? వద్దా? సినిమాను చూడాలా? వద్దా? అనేది ప్రేక్షకుల ఇష్టం. మరీ ఇంత దారుణంగా టికెట్ల రేట్లను ఏపీ ప్రభుత్వం తగ్గించడం విచారించాల్సిన విషయం..

ఏపీ ప్రభుత్వ నిర్ణయంతో ఎవరూ సంతోషంగా లేరు: సి. కల్యాణ్

‘‘నా వస్తువుని నేను తయారు చేసుకుని, నేనే రేటు ఫిక్స్ చేసుకుంటాను. ఆ వస్తువును కొనాలా? వద్దా? సినిమాను చూడాలా? వద్దా? అనేది ప్రేక్షకుల ఇష్టం. మరీ ఇంత దారుణంగా టికెట్ల రేట్లను ఏపీ ప్రభుత్వం తగ్గించడం విచారించాల్సిన విషయం..’’ అని అన్నారు నిర్మాత సి. కల్యాణ్. డిసెంబ‌రు 9 ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన ప్రస్తుత పరిస్థితులపై మీడియాతో సమావేశమయ్యారు. 


ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘టికెట్ రేట్లను తగ్గించడం వల్ల ప్రజలకు ఏదో మేలు చేస్తున్నామని ఏపీ ప్రభుత్వం అనుకోవచ్చు. కానీ నా వస్తువు నేను తయారు చేసుకుని, నా వస్తువు రేటు నేను ఫిక్స్ చేసుకుంటాను. ఆ వస్తువును కొనాలా? వద్దా? సినిమాను చూడాలా? వద్దా? అనేది ప్రేక్షకుల ఇష్టం. కానీ మరీ ఇంతగా తగ్గించడం మాత్రం విచారించాల్సిన విషయం. ఏదేమైనా ఈ సమస్య త్వరలోనే సమసిపోతుందని అనుకుంటున్నాను. మేం అంతా కలిసి మళ్లీ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రస్తుతం ప్రభుత్వ నిర్ణయంతో ఎవరూ సంతోషంగా లేరు. ఆన్‌లైన్ టికెటింగ్ వ్యవస్థను తీసుకురావాలని మేమే అడిగాం. పారదర్శకత కోసం అడిగాం. అసలు విషయం తెలుసుకుని వార్తలు రాసేవారి కన్నా.. కొత్తగా క్రియేట్ చేసి రాసేవారే మీడియాలో ఎక్కువయ్యారు. అందుకే ఇలా ఇగోలు హర్ట్ అయి ఇంత వరకు వచ్చిందని అనుకుంటున్నాను. అదనపు షోలు, మిడ్ నైట్ షోలను ప్రభుత్వమే అలవాటు చేసింది. ఇప్పుడు అవన్నీ ఆలోచించడం వేస్ట్. మనకు కావాల్సింది పరిశ్రమకు మంచి జరగడం. శేఖర్ కమ్ముల ‘ఆనంద్’ సినిమా మొదటగా 3 థియేటర్లోనే విడుదలైంది. ఆ త‌ర్వాత హిట్ అయింది. సినిమాలో స్టామినా ఉంటే ఇవన్నీ నథింగ్. ప్రభుత్వం మీద కామెంట్లు చేయడం కూడా అనవసరం. ఒకప్పుడు ఇలా ఉండేవాళ్లు కాదు. ఇంతకు ముందు సినిమా వాళ్లంతా మనవాళ్లే. కానీ ఎన్టీ రామారావుగారు పాలిటిక్స్‌లోకి రావడం, ఆ తరువాత సినిమా వాళ్లు కొందరు కాంగ్రెస్‌లోకి వెళ్లడంతో గ్రూపులు మొదలయ్యాయి. చిరంజీవి సినిమా విడుదల విషయంలో ఓ సారి ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా టికెట్ రేట్లను తగ్గించారు. అయితే మేం వెళ్లి ఆయన్ను రిక్వెస్ట్ చేశాం. ఆయన అర్థం చేసుకున్నారు. మళ్లీ సినిమా ఇండస్ట్రీకి మంచి రోజులు వస్తాయని ఆశిస్తున్నాను..’’ అని అన్నారు. 

Updated Date - 2021-12-09T01:54:04+05:30 IST