లగ్జరీ కారు కొని పన్ను కట్టలేరా?

ABN , First Publish Date - 2021-08-06T07:21:53+05:30 IST

విదేశాల నుంచి కొనుగోలు చేసిన రోల్స్‌ రాయిస్‌ కారుకు పన్ను మినహాయింపు కోరుతూ కోర్టును ఆశ్రయించిన ధను్‌షకు ఎదురుదెబ్బ తగిలింది...

లగ్జరీ కారు కొని పన్ను కట్టలేరా?

ధనుష్‌కు హైకోర్టు అక్షింతలు

విదేశాల నుంచి కొనుగోలు చేసిన రోల్స్‌ రాయిస్‌ కారుకు పన్ను మినహాయింపు కోరుతూ కోర్టును ఆశ్రయించిన ధను్‌షకు ఎదురుదెబ్బ తగిలింది. ‘ఇలాంటి అభ్యర్థనను నా జీవితంలో చూడలేదు’ అని మద్రాస్‌ హైకోర్టు న్యాయమూర్తి ధను్‌షకు చురకలంటించారు. దాంతో ‘ఇప్పటికే సగం పన్ను చెల్లించాం, మిగిలినది చెల్లిస్తాం. కేసును ఉపసంహరించుకునేందుకు అనుమతించండి’ అని ధనుష్‌ తరపు న్యాయవాది కోర్టును కోరారు. అయితే ఆ అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది. ‘నిజంగా మీకు ఆ ఉద్దేశం ఉంటే 2018లో సుప్రీంకోర్టులో వివాదం పరిష్కారమయ్యాక మీరు ఆ పని చేసేవారు’ అని వ్యాఖ్యానించింది. ఆగస్టు 9న పూర్తి పన్నును చెల్లిస్తామని కోర్టుకు ధనుష్‌ తెలిపారు.


Updated Date - 2021-08-06T07:21:53+05:30 IST