Buchi Babu: హిట్ తర్వాత కూడా ఇంత గ్యాప్ అంటే మర్చిపోతారేమో..?

ABN , First Publish Date - 2022-08-30T15:16:52+05:30 IST

సినిమా ఇండస్ట్రీలో ఎంత పెద్ద దర్శకుడికైనా కాస్త గ్యాప్ వస్తే చాలామంది మర్చిపోతుంటారు. మళ్ళీ ఆ దర్శకుడికి అవకాశం రావాలంటే ఎదురుచూడాల్సిందే. హిట్ ఇచ్చిన దర్శకుడు కాస్త గ్యాప్ తీసుకుంటే అటు ఇండస్ట్రీ వర్గాలలో ఇటు ప్రేక్షకుల్లో రక రకాల చర్చలు

Buchi Babu: హిట్ తర్వాత కూడా ఇంత గ్యాప్ అంటే మర్చిపోతారేమో..?

సినిమా ఇండస్ట్రీలో ఎంత పెద్ద దర్శకుడికైనా కాస్త గ్యాప్ వస్తే చాలామంది మర్చిపోతుంటారు. మళ్ళీ ఆ దర్శకుడికి అవకాశం రావాలంటే ఎదురుచూడాల్సిందే. హిట్ ఇచ్చిన దర్శకుడు కాస్త గ్యాప్ తీసుకుంటే అటు ఇండస్ట్రీ వర్గాలలో ఇటు ప్రేక్షకుల్లో రక రకాల చర్చలు మొదలవుతాయి. ఇటీవల కొన్ని రోజులుగా ఉప్పెన సినిమా దర్శకుడు బుచ్చిబాబు (Buchi Babu) గురించి ఇలాంటి కామెంట్స్ వినిపిస్తున్నాయి. స్టార్ డైరెక్టర్ సుకుమార్‌ (Sukumar)కు అత్యంత సన్నిహితంగా ఉండే బుచ్చిబాబు ఆయన వద్ద దర్శకత్వ శాఖలో పనిచేశారు.


ఆ బాండింగ్‌తోనే మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers), సుకుమార్ రైటింగ్స్ కలిసి నిర్మించిన ఉప్పెన సినిమాకు దర్శకత్వం వహించే ఛాన్స్ అందుకున్నారు. ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఉప్పెన సక్సెస్ తర్వాత బుచ్చిబాబు ఖాళీ లేకుండా సినిమాలు సంతకం చేస్తారని అందరూ చెప్పుకున్నారు. తీరా చూస్తే నెక్స్ట్ సినిమాకు సంబంధించిన ప్రకటన ఇప్పటివరకూ రానేలేదు. వాస్తవంగా అయితే, మైత్రీ వారి నిర్మాణంలోనే బుచ్చిబాబు తన రెండవ సినిమాను కూడా చేయాలని ఒప్పందం ఉందట.


అదీకాక ఆల్త్రెడీ ఎన్టీఆర్ (NTR) కోసం కథ సిద్ధం చేసుకొని ఆయనకు చెప్పి ఒప్పించినట్టు వార్తలు వచ్చాయి. కానీ, కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేయాల్సిన ప్రాజెక్ట్ ఇంకా పట్టాలెక్కలేదు. ఆ ప్రభావం బుచ్చిబాబు మీద పడుతున్నట్టు టాక్ వినిపిస్తోంది. మొదటి సినిమాతో భారీ హిట్ అందుకున్న తర్వాత కూడా ఇంత గ్యాప్ వస్తే ఎలా..? ఏదో ఒక ప్రాజెక్ట్‌తో రెడీ అవ్వాల్సి కదా..అనే మాటలు వినిపిస్తున్నాయి. మరి నిజంగా బుచ్చిబాబు ఎన్టీఆర్ కోసమే ఎదురుచూస్తూ ఇంకో హీరోతో సినిమా చేయకుండా ఆగుతున్నారా..లేక పూర్తి స్థాయిలో స్క్రిప్ట్ వర్క్‌లో ఉన్నారా..? అనేది క్లారిటీ లేదు. ఇటీవల మాత్రం తన గురువు సుకుమార్‌తో బుచ్చిబాబు ఏదో స్క్రిప్ట్ డిస్కర్షన్ చేస్తూ ఉన్న ఫొటోస్ మాత్రం నెట్టింట హల్‌చల్ చేశాయి. మరి బుచ్చిబాబు కొత్త సినిమా కబురెప్పుడు చెబుతారో చూడాలి. 

Updated Date - 2022-08-30T15:16:52+05:30 IST