సంజాయిషీలు లేనేలేవ్... అబార్షన్ మా హక్కు: Lily Allen

ABN , First Publish Date - 2022-07-02T01:23:55+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో గతంలో అబార్షన్ (abortion) అనేది చట్టబద్ధమైన హక్కు. ఆ దేశంలో 50ఏళ్లుగా మహిళలకు అబార్షన్ చేయించుకునే హక్కు ఉంది. తాజాగా అక్కడి సుప్రీం కోర్టు అబార్షన్‌కు వ్యతిరేకంగా

సంజాయిషీలు లేనేలేవ్... అబార్షన్ మా హక్కు: Lily Allen

అగ్రరాజ్యం అమెరికాలో గతంలో అబార్షన్ (abortion) అనేది చట్టబద్ధమైన హక్కుగా ఉండేది. ఆ దేశంలో 50ఏళ్లుగా స్త్రీలు అబార్షన్ చేయించుకునే హక్కు ఉంది. తాజాగా అక్కడి సుప్రీం కోర్టు అబార్షన్‌కు వ్యతిరేకంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఆదేశాలకు వ్యతిరేకంగా అనేక మంది సెలబ్రిటీలు తమ గళాన్ని వినిపిస్తున్నారు. అమెరికన్ సింగర్, సాంగ్ రైటర్ లిలీ అలెన్(Lily Allen)కూడా స్పందించారు. తనకు అబార్షన్ జరిగిందని తెలిపారు. ఆ నిర్ణయం గురించి ఎవరికీ సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. 


తాజాగా అమెరికాలో ఓ మ్యూజిక్ ఫెస్టివల్ జరిగింది. ఈ ఫెస్ట్‌లో ఒలివియా రొడ్రిగో (Olivia Rodrigo), లిలీ అలెన్ పాల్గొన్నారు. ఒలివియా ఓ పాటను పాడారు. లిలీ అలెన్ 2009లో అలపించిన సాంగ్‌ను ప్రదర్శన ఇచ్చారు. అనంతరం అమెరికన్ సుప్రీం కోర్టు మెంబర్స్‌కు ఈ పాటను అంకితమిచ్చారు. లిలీ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో కూడా ఓ మెసేజ్‌ను అభిమానులతో పంచుకున్నారు. ‘‘అసాధారణమైన కారణాల వల్ల అబార్షన్ చేయించుకోవచ్చని కొంత మంది చెబుతున్నారు. వారు అటువంటి ఉదాహరణాలను పోస్ట్ చేయడం మనేస్తారని ఆశిస్తున్నాను. నాతో సహా చాలా మందికి మృత శిశువును కనడం ఇష్టం ఉండదు. అబార్షన్ చేయించుకోవడానికి ఈ ఒక్క కారణం చాలు. దాని గురించి ఎవరికి సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదు’’ అని లిలీ అలెన్ పోస్ట్ పెట్టారు. సింగర్స్ టేలర్ స్విఫ్ట్ (Taylor Swift), సెలెనా గోమెజ్ కూడా సుప్రీం తీర్పుపై స్పందించారు.  ‘‘దశాబ్దాలుగా మహిళలు తమ హక్కుల కోసం పోరాడుతున్నారు. నేడు సుప్రీం వెలువరించిన తీర్పు అన్నింటిని సమసిపోయేలా చేసింది. మనం ఈ హక్కుల విషయంలో ఎక్కడ ఉన్నామో తలచుకుంటేనే భయం వేస్తుంది’’ అని టేలర్ స్పష్టం చేశారు.



Updated Date - 2022-07-02T01:23:55+05:30 IST