Brahmastra review: కథపై టెక్నాలజీ ఆధిపత్యం!

ABN , First Publish Date - 2022-09-10T00:19:23+05:30 IST

గత కొన్ని రోజుల నుంచి ‘బ్రహ్మాస్త్ర’ టీం సినిమాను విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా దర్శకధీరుడు రాజమౌళి తెలుగు వెర్షన్‌ను త భుజస్కందాలపై వేసుకొని రణబీర్‌, అలియా, కరణ్‌ జోహార్‌ లాంటి వాళ్ళని హైదరాబాద్‌లో బాగా ప్రచారం చేయించాడు. ఆయన ముఖర్జీ ఈ చిత్రానికి దర్శకుడు,

Brahmastra review: కథపై టెక్నాలజీ ఆధిపత్యం!

సినిమా రివ్యూ: ‘బ్రహ్మాస్త్రం’ (Brahmastra Review)

విడుదల తేదీ: 9–9–2022

నటీనటులు: రణబీర్‌ కపూర్‌(Ranbir kapoor), అలియా భట్‌(Alia bhatt), అమితాబ్‌ బచ్చన్‌(Amitab bachan), నాగార్జున, మౌని రాయ్‌ తదితరులు

నిర్మాతలు: కరణ్‌ జోహార్‌, అపూర్వ మెహతా, నమిత్‌ మల్హోత్రా, రణబీర్‌ కపూర్‌, అయాన్‌  ముఖర్జీ 

మాటలు: హుస్సేన్‌ దలాల్‌

సంగీతం: ప్రీతమ్‌

నేపథ్య సంగీతం: సిమోన్‌ ప్రాంగ్లిన్‌

దర్శకత్వం: అయాన్‌ ముఖర్జీ 

సమర్పణ: ఎస్‌ఎస్‌.రాజమౌళి(తెలుగు)


– సురేశ్‌ కవిరాయని


గత కొన్ని రోజుల నుంచి ‘బ్రహ్మాస్త్ర’ టీం సినిమాను విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా దర్శకధీరుడు రాజమౌళి తెలుగు వెర్షన్‌ను త భుజస్కందాలపై వేసుకొని రణబీర్‌, అలియా, కరణ్‌ జోహార్‌ లాంటి వాళ్ళని హైదరాబాద్‌లో బాగా ప్రచారం చేయించాడు. ఆయన ముఖర్జీ ఈ చిత్రానికి దర్శకుడు, రణబీర్‌, ఆలియాభట్‌ జంటగా నటించారు. అమితాబ్‌ బచ్చన్‌, నాగార్జున కీలక పాత్రలు పోషించారు. హిందూ పురాణాలలోని కొన్ని అస్ర్తాలను తీసుకొని వాటికి ఆధునికతను జోడించి కల్పిత కథను తయారు చేశారు. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ సినిమా మొదటి భాగం ‘బ్రహ్మాస్త్ర: శివ’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మెగాస్టార్‌ చిరంజీవి ఈ సినిమా కథని తన గొంతుతో వినిపిస్తారు. చాలామంది పెద్దలు ఈ సినిమాలో భాగమయ్యారు. మరి ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం. (Brahmastra Review)


కథ:

శివ (రణబీర్‌ కపూర్‌) డీజేగా పని చేస్తుంటాడు. ఒక పండగలో అతనికి ఈషా (అలియా భట్‌) కనపడుతుంది, తొలి చూపులోనే ప్రేమ పుడుతుంది. అతనికి తరచూ బ్రహ్మాస్త్రని కాపాడాలనే కల వస్తుంది. బ్రహ్మాస్త్ర అనే అస్త్రం మూడు ముక్కలై ఒకటి శాస్త్రవేత్త (షారుఖ్‌ ఖాన్‌),  ఆర్టిస్ట్‌ అనీష్‌ శెట్టి (నాగార్జున), మూడోది గురువుగారు (అమితాబ్‌ బచ్చన్‌) దగ్గర ఉంటాయి. తనకి తెలియకుండానే తనకి కొన్ని శక్తులు ఉంటాయని గ్రహిస్తాడు శివ. 

అలాగే ఆ బ్రహ్మాస్ర్తానికి తనకి ఏదో సంబంధం ఉందని గ్రహిస్తాడు. జునూన్‌ (మౌని రోయ్‌) అనే ఆమె ఆ బ్రహ్మాస్ర్త్రాన్ని వశపరచుకోవాలని తన బలగంతో ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఆమెని అడ్డుకొని బ్రహ్మాస్త్రం రక్షించడానికి వెళతాడు శివ, అతని ప్రియురాలు ఈషా. ఆ బ్రహ్మాస్త్రం కథ ఏంటి, శివకి దానికి వున్నా సంబంఽధం ఏంటి, గురువుగారు ఏమవుతారు, శివ చివరికి ఆ అస్ర్త్రాన్ని  కాపాడతారు అన్నది కథ. (Brahmastra Review)




విశ్లేషణ:

హాలీవుడ్‌లో కామిక్స్‌ పేరు మీద చాలా సినిమాలొచ్చాయి. కొంతమంది దుష్టులు ఈ ప్రపంచాన్ని తమ శక్తులతో తమ వశపరుచుకోవాలని చూస్తారు. కానీ ఇంకో సూపర్‌ పవర్‌ వున్న అతను లేక ఆమె వాళ్ళని ఎదుర్కొని ఎలా ఈ ప్రపంచాన్ని రక్షించారు అన్న కథాంశంతో ఈ కామిక్స్‌ సినిమాలు వచ్చాయి. అలాంటిదే ఈ బ్రహ్మాస్త్ర’ సినిమా కూడా. అయితే దర్శకుడు, రచయిత అయినా అయాన్‌ ముఖర్జీ మన హిందూ పురాణాల్లో ఉండే అస్ట్రాలను తీసుకొని వాటికి ఆధునికతను జోడించి ఈ సినిమా రూపొందించారు. చిరంజీవి తన గొంతుతో కథ వివరిస్తూ ఈ ఈ రాష్ట్రాల గురించి చెబుతారు. అలాగే ఈ బ్రహ్మాస్ర్తానికి, కథలో నాయకుడు అయినా శివకి ఉన్న సంబంధం గురించి కూడా వివరిస్తారు. ఇంత వరకు బాగానే వుంది కానీ షారుఖ్‌ ఖాన్‌ కూడా మొదట్లోనే ఒక పదిహేను నిమిషాలపాటు కనపడతాడు.  షారుక్‌ నుంచి ప్రతినాయకులు బ్రహ్మాస్త్ర ముక్కని చేజిక్కించుకుంటారు. అది అయ్యాక, కథ రణబీర్‌, ఆలియాభట్‌ ప్రేమ మీదకి పోతుంది. ఇక్కడే దర్శకుడు ఆయన గాడి తప్పాడు. వాళ్లిద్దరి ప్రేమ సన్నివేశాలను, ప్రేమ కథ సినిమాలో ఎక్కువ చూపించటంతో అసలు కథ పక్కకు వెళ్లిపోయింది. దానికి తోడు సినిమా అంత టెక్నాలజీ ఎక్కువ కావడంతో చూస్తున్న ప్రేక్షకుడికి కొంచెం విసుగు పుడుతుంది. ఎందుకంటే కథ మీద పట్టు లేకుండా అనవసరమైన గ్రాఫిక్స్‌ ఎక్కువ చూపించటంతో వాటి ప్రభావం కథపై ఎక్కువై కథ మీద ఆదిపత్యంగా ఉంటుంది. అందువల్ల  సినిమా గాడి తప్పి చూస్తున్న ప్రేక్షకుడికి ఏం జరుగుతుందో అర్థం కాదు. దానికి తోడు ఈ సినిమా ఎప్పుడో మొదలుపెట్టినా అప్పుడు వాళ్ళ మధ్య ఏమి లేకపోయినా, ఇప్పుడు లీడ్‌ పెయిర్‌ అయినా రణబీర్‌, అలియా భార్యభర్తలు అయ్యారు. అందువల్ల ఈ సినిమా వాళ్ళ కోసమే తీసారా అన్నట్టుగా ఉంటుంది. ఆ డైలాగ్స్‌ కూడా అలానే అనిపిస్తాయి. కథలో ఎక్కువ ప్రేమ కథ ఉండటం, ప్రేక్షకుడు ఆశించిన పోరాట లేక ఆసక్తికర సన్నివేశంలో ఎక్కువ లేకపోవటం, సినిమా సాఫీగా సాగుతున్నా.. ఎక్కడ అబ్బురపరిచే దృశ్యాలు లేవు.(Brahmastra Review)


నటీనటుల విషయానికి వస్తే రణబీర్‌ కపూర్‌ చక్కగా చేశాడు. అలియా అతనికి సరి అయినా జోడిగా సరిపోయింది. నాగార్జున, షారుఖ్‌ ఖాన్‌ కాసేపు కనిపించారు. నాగార్జున వచ్చాక యాక్షన్‌ సన్నివేశాలు మొదలవుతాయి. అమితాబ్‌ బచ్చన్‌కి చేసింది చెప్పుకోదగ్గ పాత్ర కాదు. ఆయన ఇలాంటి పాత్రలెన్నో చేశారు.  మౌని రాయ్‌ విలన్‌ గా మెప్పించింది.  ఆమె నటన హావభావాలు బావున్నాయి. ఆమెది కీలక పాత్ర అనొచ్చు. పాటలు బాగున్నాయి. నేపథ్య సంగీతం అంత ఆకట్టుకునేలా లేదు. మొత్తం మీద బ్రహ్మాస్త్ర అనే సినిమా సాంకేతికంగా చాలా బాగుంటుంది. దర్శకుడు అయాన్‌ ముఖర్జీ కథ మీద కొంచెం దృష్టి పెట్టి ఉంటే బాగుండేది. గ్రాఫిక్స్‌ ఎక్కువయ్యాయి, సినిమాలో చూసినవే చూస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఒకటి రెండు దృశ్యాలు తప్పితే సినిమాలో గ్రాఫిక్స్‌ తప్ప ఏమి ఆసక్తికరంగా లేవు. ఇంకా రెండో భాగంలో అయినా అయాన్‌ ముఖర్జీ కథ మీద దృష్టి పెడితే బాగుంటుంది. లేకపోతే వందల కోట్లు హుళక్కే. ఈ సినిమ చూశాక తెలుగు సినిమాలు హిందీలో ఎందుకు ఆడుతున్నాయి. హిందీ సినిమాలు ఎందుకు ఆడటం లేదో అర్థం అయింది. (Brahmastra Review)


ట్యాగ్‌లైన్‌: కథపై టెక్నాలజీ ఆధిపత్యం! 


Updated Date - 2022-09-10T00:19:23+05:30 IST