‘రంగమార్తాండ’లో బ్రహ్మానందం నవ్వించరా?

ABN , First Publish Date - 2022-01-18T17:48:03+05:30 IST

దర్శకుడు కృష్ణవంశీ తాజా చిత్రం ‘రంగమార్తాండ’ చిత్రీకరణ ఈ మధ్యనే కంప్లీట్ అయింది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ‘నటసామ్రాట్’ మరాఠీ సూపర్ హిట్ చిత్రానికిది అఫీషియల్ రీమేక్ అన్న సంగతి తెలిసిందే. నానా పటేకర్ ప్రధాన పాత్ర పోషించారు. తెలుగులో ఇదే పాత్రను ప్రకాశ్ రాజ్ చేస్తున్నారు. రమ్యకృష్ణ, రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. నాటక రంగానికే తన జీవితాన్ని అంకింతం చేసిన ఓ మహానటుడి కథగా ఈ సినిమా తెరకెక్కుతోంది.

‘రంగమార్తాండ’లో బ్రహ్మానందం నవ్వించరా?

దర్శకుడు కృష్ణవంశీ తాజా చిత్రం ‘రంగమార్తాండ’ చిత్రీకరణ ఈ మధ్యనే కంప్లీట్ అయింది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ‘నటసామ్రాట్’ మరాఠీ సూపర్ హిట్ చిత్రానికిది అఫీషియల్ రీమేక్ అన్న సంగతి తెలిసిందే. నానా పటేకర్ ప్రధాన పాత్ర పోషించారు. తెలుగులో ఇదే పాత్రను ప్రకాశ్ రాజ్ చేస్తున్నారు. రమ్యకృష్ణ, రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. నాటక రంగానికే తన జీవితాన్ని అంకింతం చేసిన ఓ మహానటుడి కథగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఇందులో మరో కీలక పాత్రను కామెడీ కింగ్ బ్రహ్మానందం చేస్తున్నారు. ఒరిజినల్ లో నానా పాటేకర్ ఫ్రెండ్ పాత్రను విక్రమ్ గోఖలే పోషించారు. అది చాలా సీరియస్ పాత్ర. కామెడీ అసలుండదు. ఆ పాత్రనే తెలుగులో బ్రహ్మీ చేస్తుండడం విశేషంగా చెప్పాలి. ‘బాబాయ్ హోటల్’ తర్వాత బ్రహ్మానందం చేస్తోన్న మరో ఎమోషనల్ కేరక్టర్ ఇదేనని చెప్పాలి.


నిజానికి విక్రమ్ గోఖలే పాత్రను తాను చేస్తానని కృష్ణవంశీకి ఓ సీనియర్ నటుడు కాల్ చేసి.. అడిగాడట. ఒక్కపైసా కూడా వద్దని రిక్వెస్ట్ చేశాడట. అయితే ఆ పాత్రలో బ్రహ్మానందాన్ని తప్ప తాను మరెవరినీ ఊహించుకోలేనని కృష్ణవంశీ ఆ సీనియర్ నటుడికి చెప్పారట. బ్రహ్మానందం నటనా ప్రతిభపై కృష్ణవంశీకి అంతటి నమ్మకం. అందుకు తగ్గట్టుగానే బ్రహ్మానందం ఆ పాత్రలో జీవించారట. ఒరిజినల్లో ఆ పాత్రకి విషాదాంతం ఉంటుందట. తెలుగులో కూడా దాన్ని కంటిన్యూ చేస్తున్నారట దర్శకుడు. ఇందులో కొన్ని సన్నివేశాల్లో బ్రహ్మీ నటనకు కృష్ణవంశీ చాలా ఎమోషనల్ అయిపోయి ఆయన్ని కౌగిలించుకున్నారట. మరి ‘రంగమార్తాండ’ చిత్రం బ్రహ్మానందం కెరీర్ ను ఎలాంటి మలుపుతిప్పుతుందో చూడాలి.   

Updated Date - 2022-01-18T17:48:03+05:30 IST