Brad Pitt: భార్య వదిలి వెళ్లినందుకు.. ఈ నటుడు శిల్పకారుడు అయ్యాడు..

Twitter IconWatsapp IconFacebook Icon
Brad Pitt: భార్య వదిలి వెళ్లినందుకు.. ఈ నటుడు శిల్పకారుడు అయ్యాడు..

జీవితంలో అనుకోని దెబ్బ తగిలితే తల్లడిల్లిపోతారు. కుంగుబాటుకి గురవుతారు... లేదా ఏదో ఓ వ్యసనానికి బానిసవుతారు. కానీ హాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ బ్రాడ్‌పిట్‌ (Brad Pitt) మాత్రం శిల్పాలను (Sculptures) చెక్కుతూ సాంత్వన పొందుతున్నాడు. ఐదేళ్ల క్రితం భార్య ఏంజిలినా జోలి (Angelina Jolie) పిల్లలతో పాటు ఇళ్లు విడిచి వెళ్లిపోయింది. విడాకుల నోటీసూ పంపింది. ఆ బాధ నుంచి మనసు మళ్లించుకోవడానికి బ్రాడ్‌పిట్‌ శిల్పకళకు దగ్గరయ్యాడు. (Brad Pitt sought solace sculpting)

Brad Pitt: భార్య వదిలి వెళ్లినందుకు.. ఈ నటుడు శిల్పకారుడు అయ్యాడు..


ఇటీవలే తను చెక్కిన శిల్పాలతో ఫిన్లాండ్‌లో ఎగ్జిబిషన్‌ ఏర్పాటుచేశాడు. ఇందులో బ్రాడ్‌ చెక్కిన తొమ్మిది కళాఖండాలున్నాయి. మిగతావి బ్రిటిష్‌ కళాకారుడు థామస్‌ హౌజ్‌ఏగో, సంగీతకారుడు నిక్‌ కేవ్‌కి చెందినవి. అమెరికాలో పెరిగిన గన్‌ కల్చర్‌ (Gun Culture) పై పెద్ద కళాఖండాన్ని బ్రాడ్‌ తీర్చిదిద్ది అందరిలో ఆలోచనలు రేకెత్తిస్తున్నాడు. ‘ఈ శిల్పాల్లో నన్ను నేను వెతుక్కుంటూ, గతంలో వేసిన తప్పటడుగుల్ని సమీక్షించుకుంటున్నా’ అంటున్నాడీ హాలీవుడ్‌ శిల్పకారుడు.

Brad Pitt: భార్య వదిలి వెళ్లినందుకు.. ఈ నటుడు శిల్పకారుడు అయ్యాడు..


AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.