కోలీవుడ్ స్టార్ థలా అజిత్ కుమార్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'వలిమై'. హెచ్. వినోద్ తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమా గత ఫిబ్రవరిలో విడుదలై అజిత్ కెరీర్లో మరో భారీ హిట్‌గా నిలిచింది. ఆయన క్రేక్కు ఏమాత్రం తగ్గకుండా భారీ స్థాయిలో బిజినెస్ జరిగిన ఈ మూవీ తెలుగులో కూడా మంచి హిట్ సాధించింది.
ఇక ఈ నెల 24 నుంచి 'వలిమై' చిత్రం ఓటిటి ప్రీమియర్‌గా జీ5 లో స్ట్రీమింగ్కు వస్తుండడంతో ఈ సినిమాను నిర్మించిన అగ్ర నిర్మాత బోనీ కపూర్ అధికారికంగా మూవీ కలెక్షన్‌పై అప్డేట్ ఇచ్చారు. 'వలిమై' రూ. 200 కోట్ల గ్రాస్ క్లబ్లో చేరింది అని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ సినిమాలో బాలీవుడ్ క్రేజీ బ్యూటీ హుమా ఖురేషి హీరోయిన్గా.. మన టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ విలన్‌గా నటించారు.