కొత్తమ్మాయితో చేయి పట్టుకుని కనిపించిన హృతిక్ రోషన్.. గాళ్ ఫ్రెండా అని కామెంట్ చేస్తోన్న నెటిజన్లు..

ABN , First Publish Date - 2022-01-30T00:13:24+05:30 IST

బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్, సుసానే ఖాన్ కొన్నేళ్ల క్రితం విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.

కొత్తమ్మాయితో చేయి పట్టుకుని కనిపించిన హృతిక్ రోషన్.. గాళ్ ఫ్రెండా అని కామెంట్ చేస్తోన్న నెటిజన్లు..

బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్, సుసానే ఖాన్  కొన్నేళ్ల క్రితం విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అనంతరం సుసానే ఖాన్ అర్స్లాన్ గోనితో డేటింగ్ చేయడం మొదలుపట్టింది. కానీ, హృతిక్ మాత్రం ఒంటరి జీవితాన్ని గడుపుతున్నాడు. తాజాగా అతడు ఒక అమ్మాయితో కనిపించాడు. దీంతో ఆ  వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

 

వీడియోలో... హృతిక్‌తో ఉన్న అమ్మాయితో... మన గ్రీకు వీరుడు ఓ జపనీస్ రెస్టారెంట్‌లో డిన్నర్ కూడా చేశాడు. వాళ్లిద్దరూ బయటకు వస్తుండగా మీడియా వారు ఫొటోలు క్లిక్‌మనిపిస్తూ ఉండటంతో ఆమెని సురక్షితంగా కారు ఎక్కించాడు హృతిక్. అనంతరం అతడు కూడా కారు ఎక్కేశాడు. కానీ, బాలీవుడ్ అందగాడితో ఉన్న ఆ అజ్ఞాత సుందరి మాస్క్ ధరించి ఉండటంతో ముఖం మాత్రం మీడియాకు కనిపించలేదు. దీంతో నెటిజన్లు ఎవరా అమ్మాయి అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు. హృతిక్ చేతిలో చేయి వేసి కనిపించడంతో అతడి గాళ్ ఫ్రెండేనని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. కొందరు మాత్రం అతడి బంధువేమో అని అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా సదరు వీడియో కాసేపట్లోనే నెట్టింట హల్ చల్ చేయడం మొదలైపోయింది. ఆ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.. 


ప్రస్తుతం హృతిక్ రోషన్ ‘విక్రమ్ వేద’ రీమేక్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్, రాధికా అప్టే కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘ఫైటర్’ అనే చిత్రంలోను అతడు కనిపించనున్నాడు. ఈ మూవీలో అతడి సరసన దీపికా పదుకొణె నటిస్తోంది.



Updated Date - 2022-01-30T00:13:24+05:30 IST