సుకుమార్‌కు బాలీవుడ్ ఆఫర్..

సుకుమార్‌కు బాలీవుడ్ ఆఫర్ ఉందని తాజాగా ఆయనే స్వయంగా వెల్లడించారు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ 'పుష్ప' సినిమా షూటింగ్ సమయంలో ఫోన్ చేసి 'మనం సినిమా చేద్దాం. ముంబై వచ్చేయండి అన్నారు'  అని తెలిపారు. బాలీవుడ్‌లో సినిమా చేసే ఆలోచనలో నేనూ ఉన్నాను..అక్కడ గనక సినిమా చేస్తే ముందు అక్షయ్‌తోనే ఉంటుంది..సరైన స్క్రిప్ట్ కుదిరితే ఖచ్చితంగా ఆయనతోనే చేస్తానని సుకుమార్ ఇటీవల ఓ ఇంటర్యూలో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం 'పుష్ప:ది రైజ్ పార్ట్ 1' సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న ఈ లెక్కల మాస్టారు వచ్చే నెల నుంచి దీని కొనసాగింపు 'పుష్ప పార్ట్ 2'ను సెట్స్ మీదకు తీసుకువచ్చేందుకు సన్నాహాలలో ఉన్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌ను మైత్రీ మూవీ మేకర్స్, ముత్తం శెట్టి మీడియా కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. దేవీశ్రీప్రసాద్ సంగీత దర్శకుడు.

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.