బాలీవుడ్ మూవీ 'సత్యనారాయణ్ కీ కథ' టైటిల్ చేంజ్..!

బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న క్రేజీ మూవీ 'సత్యనారాయణ్ కీ కథ'. త్వరలో ఈ టైటిల్ చేంజ్ చేయబోతున్నారు. కార్తీక్ ఆర్యన్ - శ్రద్ధ కపూర్ జంటగా నటిస్తున్న ఈ సినిమాకి నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ సమీర్ విద్వాంస్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రముఖ నిర్మాత సాజిద్ నడియాద్ వాలా, నమః పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేస్తూ టైటిల్‌ను మోషన్ పోస్టర్‌ను  రిలీజ్ చేశారు. అయితే, తాజాగా ఈ సినిమా టైటిల్‌ను మారుస్తున్నట్టు దర్శకుడు అధికారికంగా ప్రకటించారు. "మనోభావాలను దెబ్బతీయకుండా ఉండటానికి" ఈ నిర్ణయం అంటూ డైరెక్టర్ సమీర్ విద్వాన్స్ పోస్ట్ చేశారు. 'మనోభావాలను దెబ్బతీయకుండా ఉండటానికి ఇటీవల ప్రకటించిన మా చిత్ర ‘సత్యనారాయణ్ కి కథ’ టైటిల్‌ను మార్చాలని మేము నిర్ణయం తీసుకున్నాము. ఈ నిర్ణయానికి సినిమా నిర్మాతలు, సృజనాత్మక బృందం కూడా పూర్తి మద్దతు ఇస్తున్నాయి. ఇక అతి త్వరలో ఈ సినిమా కొత్త టైటిల్‌ను ప్రకటిస్తాము' అని ట్వీట్ చేశారు. Bollywoodమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.