నీ బ్యాగ్‌ను, పర్స్‌ను చూపించాలనుకుంటున్నావ్ అంతేగా.. ఇంత షో దేనికంటూ.. Rakhi Sawant పై నెటిజన్ల సెటైర్లు..

ABN , First Publish Date - 2022-06-18T23:47:29+05:30 IST

బాలీవుడ్‌లో ఐటం సాంగ్స్‌తో ఫేమ్ సంపాదించుకున్న అందాల భామ రాఖీ సావంత్ (Rakhi Sawant). కొన్ని రోజుల క్రితమే భర్త రితేశ్‌కు విడాకులిచ్చింది. అతడి టాటును కూడా తొలగించింది. తాజాగా ఆమె

నీ బ్యాగ్‌ను, పర్స్‌ను చూపించాలనుకుంటున్నావ్ అంతేగా.. ఇంత షో దేనికంటూ.. Rakhi Sawant పై నెటిజన్ల సెటైర్లు..

బాలీవుడ్‌లో ఐటం సాంగ్స్‌తో ఫేమ్ సంపాదించుకున్న అందాల భామ రాఖీ సావంత్ (Rakhi Sawant). కొన్ని రోజుల క్రితమే భర్త రితేశ్‌కు  విడాకులిచ్చింది. అతడి టాటును కూడా తొలగించింది. తాజాగా ఆమె మరొకరితో ప్రేమలో మునిగితేలుతోంది. బిజినెస్ మ్యాన్ ఆదిల్ ఖాన్ దుర్రానీ(Adil Khan Durrani)తో చెట్టాపట్టాలేసుకుని షికార్లు కొడుతుంది. ఈ జంటకు ఇప్పటికే నిశ్చితార్థం అయింది. త్వరలోనే అతడిని పెళ్లి చేసుకొబోతున్నట్టు తెలుస్తోంది. ఆమె శనివారం రోజు తన బాయ్‌ఫ్రెండ్‌తో కలసి ముంబై ఎయిర్ పోర్టుకు వచ్చింది. అక్కడకు వచ్చిన అనంతరం పాస్‌పోర్టును మరిచిపోయినట్టు గుర్తించింది. ఈ సందర్భంగా కొంత మంది ఫొటోగ్రాఫర్స్ ఆమెను క్లిక్ మనిపించారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు  సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ వీడియోలో.. ‘నా పోస్‌పోర్టును మరచిపోయాను. నన్ను క్షమించండి’ అని రాఖీ సావంత్ అంటుంది. అనంతరం బ్యాగ్‌ను చెక్ చేసుకోడం ప్రారంభించింది. 


ఈ వైరల్‌ వీడియో కింద సోషల్ మీడియా యూజర్స్ కామెంట్ల వర్షం కురిపించారు. ‘‘మరచిపోవడం సహజమే. కానీ, ఆమె మీడియాకు ఎందుకు క్షమాపణలు చెబుతుంది’’ అని ఓ నెటిజన్ తెలిపాడు. ‘‘లగేజీ లేకుండా ఆమె ఎక్కడకు వెళుతుంది’’ అని మరో నెటిజన్ పేర్కొన్నాడు. ‘‘ఆమె నిజంగా మరిచిపోయిందా లేదా డ్రామ్ చేస్తుందా’’ అని ఓ సోషల్ మీడియా యూజర్ వెల్లడించాడు. ‘‘ఆమె బ్యాగును, పర్స్‌ను చూపించాలనకుంటుంది’’ అని మరో సోషల్ మీడియా యూజర్ సెటైర్లు వేశాడు. రేపు బ్యాగులో చూడమని మరికొందరు చెప్పారు. 



Updated Date - 2022-06-18T23:47:29+05:30 IST