కత్రినా బ్యూటీ సీక్రెట్‌

బాలీవుడ్‌ కథానాయిక కత్రినాకైఫ్‌ అందంగా ఉండటానికి ఏం చేస్తుంది? అసలు తన ఫిట్‌నెస్‌ విశేషాలేంటీ? ఆమె రోజూ ఎలాంటి ఆహారం తీసుకుంటుంది? ఆ విశేషాలు ఇవి...


కత్రినా కైఫ్‌ రోజూ కనీసం గంటపాటు జిమ్‌లో గడుపుతుంది. తన వ్యాయామానికి సంబంధించిన విషయాల్ని తరచుగా ఆమె ఇన్‌స్టాలో షేర్‌ చేస్తుంటుంది. కత్రినా ప్రత్యేకంగా డైట్‌ పాటించదట. ఆయిల్‌ఫుడ్‌తో పాటు కారం ఉండే ఆహారాన్ని చాలా తక్కువగా తింటుంది. లండన్‌లో పుట్టి పెరిగిన ఆమెకి చిన్నప్పటి నుంచే కారం తినడం ఇష్టం ఉండదట. చక్కని డైట్‌తో పాటు మనసు హాయిగా ఉండకపోతే ఉపయోగం లేదంటుంది. హ్యాప్పీ హార్మోన్లు విడుదలైతేనే శరీరానికి ఆరోగ్యం, శక్తి వస్తుంది అంటుంది కత్రినా. 


ప్రతిరోజూ ఎగ్‌వైట్‌ తింటుంది. ఉడకబెట్టిన కూరగాయలతో పాటు పండ్లు, సలాడ్స్‌ తీసుకుంటుంది. కాలక్రమంలో ఎలాంటి ఆహారం మంచిదో, ఎలాంటి ఆహారం ఇబ్బందో మనకే అర్థమవుతుంది. దాన్నిబట్టి ఫుడ్‌ డైట్‌ను అలవాటు చేసుకోవాలంటుంది. వ్యాయామానికి ట్రైనర్‌ ఉంటాడు. అయితే ఎలాంటి ఫుడ్‌ తీసుకోవాలనే విషయం ఎవరినీ అడగదట.


షూటింగ్స్‌తో బిజీగా ఉన్నప్పుడు కూడా ఆమె ఇంటి ఆహారానికే ఓటేస్తుంది. ఆర్గానిక్‌ ఆహారం తీసుకుంటుంది. పాల ఉత్పత్తులను పెద్దగా తన డైట్‌లో తీసుకోదు. మధ్యాహ్నం లంచ్‌లో స్టీమ్డ్‌ ఫిష్‌, అవకాడో సలాడ్‌..లాంటివి ఉండేట్లు చూసుకుంటుంది. ఆయా కాలాల్లో వచ్చే పండ్లను ఖచ్చితంగా తినటంతో పాటు వేరుశనగలు, బఠానీల్లాంటివి ఇష్టపడుతుంది. అయితే బయటి ఫంక్షన్లకు వెళ్లినపుడు ఫుడ్‌ ఏమున్నా టెంప్ట్‌ అవ్వదట. పెద్దగా కత్రినాకు ఫుడ్‌ గోల్స్‌ లేవట. అంతెందుకూ కపిల్‌శర్మ కార్యక్రమానికి సల్మాన్‌తో కలిసి వెళ్లినపుడు అక్కడ మ్యాంగో స్మూతి ఇచ్చినా తినలేదట. అంత పక్కాగా కత్రినా డైట్‌ను పాటిస్తుంది కాబట్టే అంత స్లిమ్‌గా ఉంది. ఫిట్‌నెస్‌ బాడీని కొనసాగిస్తూ బాలీవుడ్‌లో దూసుకుపోతోంది. 

Bollywoodమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.