ఏ పాత్రను అయినా అలవోకగా పోషించే నటుడు కమల్ హాసన్ (Kamal Haasan). వైవిధ్య భరిత చిత్రాలతో అభిమానులను అలరిస్తుంటాడు. తాజాగా లోకేశ్ కనకరాజ్ (Lokesh Kanagaraj) తెరకెక్కించిన ‘విక్రమ్’ (Vikram) తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. కోలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. ఈ మూవీ ఇచ్చిన జోష్‌తో ‘ఇండియన్-2’ ( Indian 2) ను పట్టాలెక్కించేందుకు కమల్ సిద్ధమవుతున్నాడు. ‘ఇండియన్ 2’ కు సంబంధించిన ఓ వార్త కోలీవుడ్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. ఈ చిత్రంలో కమల్‌కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ నటించనుందని తెలుస్తోంది.
కమల్ హాసన్ నటించిన హిట్ చిత్రం ‘ఇండియన్’ (Indian). 1996లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ కొట్టింది. ప్రస్తుతం ఈ సినిమాకు ‘ఇండియన్-2’ టైటిల్‌తో సీక్వెల్ తెరకెక్కుతుంది. శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) పై కొంత భాగం చిత్రీకరణ జరిపారు. కానీ, అనివార్య కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఈ లోగా కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకుని, తల్లి అయ్యింది. సినిమాలకు టాటా చెప్పేసింది. దీంతో చిత్రబృందం కొత్త హీరోయిన్‌ను వెతికే పనిలో పడింది. బాలీవుడ్ నటి దీపికా పదుకొణె(Deepika Padukone) తో మేకర్స్ చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. భారీ పారితోషికం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారని వినికిడి. ప్రస్తుతం దీపిక ఒక్కో సినిమాకు రూ.22కోట్లను రెమ్యూనరేషన్‌గా తీసుకుంటుందని సమాచారం. ఆగస్టు చివరిలోగా ఆమెకు సంబంధించిన అధికారిక ప్రకటనను మేకర్స్ వెలువరించనున్నారని కోలీవుడ్ మీడియా తెలుపుతోంది.