గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌పై బాలీవుడ్ డైరెక్టర్ కాపీ రైట్స్ కేసు

ABN , First Publish Date - 2022-01-27T17:53:44+05:30 IST

‘ఇంతేకామ్’, ‘అందాజ్’ వంటి సినిమాలతో బాలీవుడ్‌లో గుర్తింపు పొందిన డైరెక్టర్ సునీల్ దర్శన్. తాజాగా తన సినిమాకి సంబంధించి గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్..

గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌పై బాలీవుడ్ డైరెక్టర్ కాపీ రైట్స్ కేసు

‘ఇంతేకామ్’, ‘అందాజ్’ వంటి సినిమాలతో బాలీవుడ్‌లో గుర్తింపు పొందిన డైరెక్టర్ సునీల్ దర్శన్. తాజాగా తన సినిమాకి సంబంధించి గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, మరో అయిదుగురు ఆ కంపెనీ ఉద్యోగులపై ఈ దర్శకుడు కాపీ రైట్స్ కేసు ఫైల్ చేశాడు.


అందులో.. ఈయన దర్శకత్వం వహించిన ‘ఏక్ హాసినా థి ఏక్ దివానా థా’ సినిమా 2017లో విడుదలయ్యింది. ఈ మూవీ ప్రస్తుతం కొన్ని యూట్యూబ్ ఛానెల్స్‌లో ప్రసారం అవుతోంది. కానీ ఈ సినిమాని తాను ఇంతవరకు ఎవరికీ అమ్మలేదని, తాను ఎక్కడా అప్‌లోడ్ చేయలేదని సునీల్.. అంథేరి ఈస్ట్‌లోని ఓ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశాడు. తన అనుమతి లేకుండా ఆ ఛానెల్స్ అప్‌లోడ్ చేసినప్పటికీ గూగుల్ వాటిని బ్లాక్ చేయకుండా అలాగే ఉంచిందని ఆ ఫిర్యాదులో ఆయన పేర్కొన్నాడు.


ఈ కేసు గురించి ఓ మీడియాతో ఇంటర్వ్యూలో సునీల్ మాట్లాడుతూ.. ‘నాకు సాంకేతిక అభివృద్ధిపై విశ్వాసం ఉంది. కానీ హక్కుల ఉల్లంఘనే నాలోని తీవ్ర ఆందోళనకు కారణం.


నా దగ్గరే కాపీ రైట్స్ ఉన్న సినిమాలోని పాటలు, సీన్స్‌ని కొందరూ అన్యాయంగా యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసి సొమ్ము చేసుకుంటుంటే.. ఏం చేయలేక చూస్తున్నాను. దీనికి సంబంధించి ఎన్నోసార్లు గూగుల్ యాజమాన్యానికి రిక్వెస్ట్ పెట్టాను. కానీ వాళ్ల నుంచి స్పందన కరవైంది. అందుకే వారిపై కేసు వేయాలని నిర్ణయం తీసుకున్నాను. నిజాయతీగా కంటెంట్ క్రియేట్ చేసేవారికి నష్టం కలిగేలా ఆ సంస్థ వ్యవహరిస్తుంది’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాకుండా తన లాయర్స్ సలహా మేరకు తర్వాత ఏం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటానని ఈ ఫిల్మ్ మేకర్‌ తెలిపాడు.

Updated Date - 2022-01-27T17:53:44+05:30 IST