జై భీమ్‌లో ఆ సీన్ తీసేయాలని బాలీవుడ్ డిమాండ్

ABN , First Publish Date - 2021-11-03T22:11:54+05:30 IST

సూర్య హీరోగా తెరకెక్కిన ‘జై భీమ్’ సినిమా‌కు ప్రేక్షకుల నంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది.

జై భీమ్‌లో ఆ సీన్ తీసేయాలని బాలీవుడ్ డిమాండ్

సూర్య హీరోగా తెరకెక్కిన ‘జై భీమ్’ సినిమా‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలను కూడా సొంతం చేసుకుంది. సినిమా ఇండస్ట్రీకి  చెందిన పలువురు దీనిని మెచ్చుకుంటూ ట్వీట్ కూడా చేశారు. ఈ చిత్రంలో సూర్య లాయర్ పాత్రలో నటించగా, ప్రకాష్ రాజ్ పోలీసు పాత్రలో కనిపించారు. పండ్లు ఉన్న చెట్టుకే రాళ్లు తగులుతాయంటూ ఈ సినిమా ప్రస్తుతం ఒక వివాదంలో చిక్కుకుంది. 


ఒక కేసును దర్యాప్తు చేస్తున్న క్రమంలో ప్రకాష్ రాజ్  హిందీ మాట్లాడే బంగారు ఆభరణాల వ్యాపారిని చెంప మీద కొడతాడు. తమిళ్ మాట్లాడామని చెబుతాడు. హిందీని అపహాస్యం చేసే  క్రమంలోనే ఈ సీన్‌ను మూవీలో పెట్టారని చాలా మంది ప్రేక్షకులు భావిస్తున్నారు. మూవీలో ఆ సీన్ అవసరం లేదని వారు అంటున్నారు. ఆ సీన్‌ను చిత్రం నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 


బాలీవుడ్‌కు చెందిన ఒక సినీ విమర్శకుడు ఈ సీన్ గురించి ట్వీట్ చేస్తూ ..‘‘జై భీమ్ సినిమా చూసి నా గుండె పగిలిపోయింది. ఈ సినిమాలోని ఏ నటుడికి నేను వ్యతిరేకం కాదు. కానీ, హిందీ మాట్లాడే ఒక నటుడి చెంప మీద ప్రకాష్ రాజ్ కొట్టి తమిళ్ మాట్లాడామని చెబుతాడు. నిజం చెప్పాలంటే ఆ సీన్ చిత్రంలో అవసరం లేదు. చిత్ర బృందం ఆ సీన్‌ను తొలగిస్తుందని నేను ఆశిస్తున్నాను’’ అని ఆయన చెప్పారు.  ఆ ట్వీట్ కు ఒక సోషల్ మీడియా యూజర్ తన స్పందనను తెలిపారు. ‘‘ హిందీ మాట్లాడే భారతీయులకు ఆ సీన్ వ్యతిరేకం కాదు. చిత్రంలోని ఆ పాత్ర పోషించిన వ్యక్తి హిందీ మాట్లాడుతూ కేసు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తాడు. ప్రకాష్ రాజ్ అతడి వ్యూహాన్ని అర్థం చేసుకుంటాడు. చెంప మీద కొట్టి తమిళ్‌లో మాట్లాడామని చెబుతాడు. తమిళ్ చిత్రాలను నిర్మించేవారెవరూ హిందీ భాషకు వ్యతిరేకం కాదు’’ అని ఆయన వెల్లడించారు.





Updated Date - 2021-11-03T22:11:54+05:30 IST