వంటవాడిగా మారిన Karan Johar కొడుకు.. ఫిదా అయిన బాలీవుడ్..

ABN , First Publish Date - 2021-12-02T17:38:43+05:30 IST

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్, ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ సరోగసీ ద్వారా 2017 ఇద్దరూ పిల్లలని పొందిన విషయం తెలిసిందే. వారి పేర్లు యశ్ జోహార్, రుహీ జోహార్...

వంటవాడిగా మారిన Karan Johar కొడుకు.. ఫిదా అయిన బాలీవుడ్..

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్, ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ సరోగసీ ద్వారా 2017 ఇద్దరూ పిల్లలని పొందిన విషయం తెలిసిందే. వారి పేర్లు యశ్ జోహార్, రుహీ జోహార్. తాజాగా యశ్‌కి సంబంధించిన ఓ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది.


ఇన్‌స్టాగ్రామ్‌లో బుధవారం పోస్ట్ చేసిన ఆ వీడియోలో యశ్ వంట చేస్తున్నాడు. పోస్ట్ చేసిన కరణ్ దానికి ‘మా ఇంట్లో ఓ చెఫ్ ఉన్నాడు. చెఫ్ యశ్ జోహార్’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. అందులో యష్ తెల్లటి చెఫ్ టోపీ, కోటు ధరించి వెన్న, టొమాటోలు, దోసకాయ శాండ్‌విచ్‌ను రెడీ చేస్తున్నాడు. దీన్ని షేర్ చేసి కొద్దిసేపట్లోనే ఆయన బాలీవుడ్ స్నేహితులు తమ అభిమానాన్ని కురిపించారు.


అందాల తార కత్రినా కైఫ్ హార్ట్ ఎమోజీని పెట్టింది. ఎంత క్యూట్‌గా ఉన్నాడో అంటూ ఫరా ఖాన్ కామెంట్ పెట్టింది. ‘ఓ మై గుడ్‌నెస్.. ఎంతో క్యూట్ ఉన్న అతను వంట చేస్తున్నాడు’ అంటూ శ్వేత బచ్చన్.. అలియా భట్ తల్లి, రణ్‌బీర్ కపూర్ తల్లి, సంజయ్ కపూర్ వంటి ఎంతో మంది బాలీవుడ్ ప్రముఖులు తమ అభిమానాన్ని తెలిపారు.


అయితే డైరెక్టర్‌గా, ఫిల్మ్‌ మేకర్‌గా ఎంతో బిజీగా ఉండే కరణ్ జోహర్ ప్రస్తుతం ‘రాఖీ ఔర్ రాణీకి ప్రేమ్ కహాని’ తీస్తుండగా అది 2023, ఫిబ్రవరి 10 విడుదల కానుంది. అంతేకాకుండా ఆయన నిర్మాణ సంస్థ ‘ధర్మ ప్రొడక్షన్స్‌‌’లో తీస్తున్న సినిమాలు ‘గోవిందా నామ్ హై మేరా’, ‘జగ్ జుగ్ జియో’, ‘యోధ’, ‘మిస్టర్ అండ్ మిసేస్ మహి’ 2022లో వరుసగా విడుదల కానున్నాయి.



Updated Date - 2021-12-02T17:38:43+05:30 IST