Bollywood లో బిగ్ ఫైట్.. ఒకదానికి పోటీగా మరొకటి రిలీజ్ అవుతున్న చిత్రాల లిస్ట్ ఇదీ..!

ABN , First Publish Date - 2022-06-23T01:21:38+05:30 IST

కరోనా వల్ల గతేడాది అనేక సినిమాలు వాయిదా పడ్డాయి. ప్రస్తుతం పరిస్థితులు అనుకూలిస్తుండటంతో మేకర్స్ వరుసగా సినిమాలు విడుదల చేస్తున్నారు. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద క్లాష్ తప్పడం లేదు. వసూళ్లను

Bollywood లో బిగ్ ఫైట్.. ఒకదానికి పోటీగా మరొకటి రిలీజ్ అవుతున్న చిత్రాల లిస్ట్ ఇదీ..!

కరోనా వల్ల గతేడాది అనేక సినిమాలు వాయిదా పడ్డాయి. ప్రస్తుతం పరిస్థితులు అనుకూలిస్తుండటంతో మేకర్స్ వరుసగా సినిమాలు విడుదల చేస్తున్నారు. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద క్లాష్ తప్పడం లేదు. వసూళ్లను పంచుకోక తప్పని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. నిర్మాతలందరు రిలీజ్ డేట్‌ను మార్చడానికి ఇష్టపడటం లేదు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ బాక్సాఫీస్ క్లాష్‌లపై ఓ లుక్కేద్దామా మరి.. 


1. లాల్‌సింగ్ చద్దా వర్సెస్ రక్షాబంధాన్ (Laal Singh Chaddha vs Raksha Bandhan): 

ఆమిర్ ఖాన్, కరీనా కపూర్ హీరో, హీరోయిన్‌లు‌గా నటించిన చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’ (Laal Singh Chaddha). టామ్ హాంక్స్ నటించిన ‘ఫారెస్ట్ గంప్‌’ కు ఆఫిషియల్ రీమేక్‌గా ఈ చిత్రం రూపొందింది. ఈ మూవీ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 11న విడుదల కానుంది. అదే రోజు అక్షయ్ కుమార్, భూమి ఫడ్నేకర్ కీలక పాత్రలు పోషించిన సినిమా ‘రక్షాబంధాన్’ రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి క్రియేటివ్ డైరెక్టర్ ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వం వహించారు. అక్కీకి ఈ మధ్యనే ‘బచ్చన్ పాండే’, ‘సామ్రాట్ పృథ్వీరాజ్’ రూపంలో వరుసగా రెండు ప్లాఫ్‌లు వచ్చాయి. ఫలితంగా ఖిలాడీ హీరో ‘రక్షాబంధన్’ పై భారీ ఆశలు పెట్టుకున్నారు.


2. థాంక్ గాడ్ వర్సెస్ రామ్ సేతు (Thank God vs Ram Setu)

బాలీవుడ్‌లో శరవేగంగా సినిమాలు చేసే నటుడు అక్షయ్ కుమార్. 30 నుంచి 40 రోజుల్లోనే చిత్రాలను పూర్తి చేస్తుంటారు. ఆయన నటించిన చిత్రం ‘రామ్ సేతు’ (Ram Setu). యాక్షన్ అడ్వెంచర్‌గా తెరకెక్కింది. జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నుస్రత్ బరుచా కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా అక్టోబర్ 24న విడుదల కానుంది. అదే రోజు అజయ్ దేవగణ్, సిద్దార్థ్ మల్హోత్రా, రకుల్ ప్రీత్ సింగ్ నటించిన కామెడీ చిత్రం ‘థాంక్ గాడ్’ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీపావళి కానుకగా ఈ రెండు చిత్రాలు ఇప్పటికే బరిలో నిలిచాయి. పండగ సందర్భంగా మరో కొత్త సినిమా పోటీలోకి వచ్చిన ఆశ్చర్యపోనావసరం లేదు.   


3. సర్కస్ వర్సెస్ గణపత్ వర్సెస్ మెర్రి క్రిస్‌మస్ (Cirkus vs Ganapath vs Merry Christmas)

బాక్సాఫీస్ బరిలో మాములుగా రెండు సినిమాలు పోటీ పడితే క్రిస్‌మస్ సందర్భంగా మూడు బరిలో ఉండబోతున్నాయి. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన సినిమా ‘సర్కస్’. రణ్‌వీర్ సింగ్, పూజా హెగ్డే కీలక పాత్రలు పోషించారు. గుల్జార్ క్లాసిక్ హిట్ ‘అంగూర్’ ను ఆధారంగా చేసుకుని రూపొందించారు. ఈ చిత్రం డిసెంబర్ 23న విడుదల కాబోతుంది. పండగ సందర్భంగా మరో రెండు సినిమాలు అదే రోజు థియేటర్స్‌లోకి వస్తున్నాయి. విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ నటించిన చిత్రం ‘మెర్రి క్రిస్‌మస్’. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందింది. శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించారు. కృతి సనన్, టైగర్ ష్రాఫ్ కీలక పాత్రల్లో నటించిన ‘గణపత్’ కూడా ఇప్పటికే క్రిస్‌మస్ బరిలో ఉంది. 


4. విక్రమ్ వేద వర్సెస్ పొన్నియన్ సెల్వన్: 1 (Vikram Vedha vs Ponniyin Selvan: I) 

కోలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ పుష్కర్ గాయత్రి, మణిరత్నం బాలీవుడ్‌లో ఒకే రోజు సినిమాలను విడుదల చేయబోతున్నారు. హృతిక్ రోషన్, సైఫ్‌అలీ ఖాన్ నటించిన ‘విక్రమ్ వేద’, మణిర్నతం దర్శకత్వం వహించిన ‘పొన్నియన్ సెల్వన్-1’ ఒకే రోజు సెప్టెంబర్ 30న విడుదల కానున్నాయి. రెండు చిత్రాలపై ప్రేక్షకులు, ట్రేడ్ వర్గాల్లో మంచి బజ్ ఉండటం చెప్పుకోదగ్గ విశేషం. 


5. మిస్టర్ అండ్ మిసెస్ మహీ వర్సెస్ తేజస్ (Mr. & Mrs. Mahi vs Tejas)

బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్, కంగనా రనౌత్ బాక్సాఫీస్ వద్ద ఒకే రోజు సినిమాలు విడుదల చేయనున్నారు. జాన్వీ కపూర్, రాజ్ కుమార్ రావ్ నటించిన సినిమా ‘మిస్టర్ అండ్ మిసెస్. మహీ’. కరణ్ జోహార్ నిర్మాతగా వ్యవహరించారు. కంగనా రనౌత్ కీలక పాత్ర పోషించిన చిత్రం ‘తేజస్’. ఈ రెండు సినిమాలు  దసరా బరిలో నిలిచాయి.  


6. దృశ్యం 2 వర్సెస్ భీడ్ (Drishyam 2 vs Bheed)

అజయ్ దేవగణ్ నటించిన హిట్ సినిమా ‘దృశ్యం’. ఈ చిత్రం బీ టౌన్‌లో భారీ విజయం సాధించింది. దీంతో సీక్వెల్ ‘దృశ్యం-2’లో అజయ్ నటిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 18న థియేటర్స్‌లోకి వస్తుంది. అదే రోజు అనుభవ్ సిన్హా తెరకెక్కించిన ‘భీడ్’ కూడా విడుదల కానుంది. ‘భీడ్’ లో రాజ్ కుమార్ రావ్, భూమి ఫడ్నేకర్ కీలక పాత్రలు పోషించారు.


Updated Date - 2022-06-23T01:21:38+05:30 IST