నన్ను క్షమించు దేవుడా.. అది తట్టుకోలేక ఈ విషయాన్ని బయటపెడుతున్నా : నటి

ఇటీవల దేశంలో మళ్లీ కరోనా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో సాధారణ ప్రజలతో పాటు సెలబ్రిటీలు సైతం దీని బారిన పడుతున్నారు. అలా ఎఫెక్ట్ అయిన వారిలో నటి స్వర భాస్కర్ ఒకరు. గత కొన్ని రోజుల క్రితమే ఈ విషయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.


ప్రస్తుతం స్వర ఢిల్లీలోని తన ఇంట్లో క్వారంటైన్‌లో ఉంది. అయితే తాజాగా ఈ బ్యూటీ ఈ సారి సోషల్ మీడియాలో తన కుటుంబ విషయాలను తెలిపింది. ఇన్‌స్టాగ్రామ్‌లో తన తల్లితో చేసిన వాట్సాప్ చాటింగ్‌ని స్టోరీలో షేర్ చేసింది.

అందులో.. అమ్మని చిరాకు పెట్టడం నా జీవితంలో నేను చేసిన గొప్ప పనుల్లో ఒకటి‌’ అని స్వర రాసుకొచ్చింది. దానికి కౌంటర్‌గా ‘నువ్వు చేస్తే అదే నీ వెంటపడుతుంది గుర్తుపెట్టుకో’ అని ఆమె తల్లి చెప్పింది. దానికి వెంటనే స్వర ‘అమ్మ నీ సొంత బిడ్డను తిట్టడం ఆపండ’ని రాసింది.


అంతేకాకుండా దానికి.. ‘నన్ను క్షమించు దేవుడా. కోవిడ్ క్వారంటైన్ కారణంగా చాలా బోర్ ఫిల్ అవుతున్నా. అందుకే నా ఫ్యామిలీ చాట్‌ని బయటపెడుతున్నాన’ని స్వర రాసుకొచ్చింది. కొన్ని రోజుల క్రితం తనకు కోవిడ్ వచ్చిన విషయాన్ని చెబుతూ.. ‘నాకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. అప్పటి నుంచి క్వారంటైన్‌లో ఉన్నా. అవసరమైన జాగ్రత్తలు అన్ని తీసుకుంటున్నా. అందరూ సరైన నిబంధనలు పాటించండి. జాగ్రత్తగా ఉండండి’ అంటూ పోస్ట్ పెట్టింది.


Bollywoodమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.