అందుకే ఎక్కడైనా అందరి ప్రాతినిథ్యం ముఖ్యమనేది: Priyanka Chopra

బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగి ప్రస్తుతం హాలీవుడ్‌లో పాగా వేసింది. అక్కడ కూడా వరుసగా మంచి ప్రాజెక్ట్‌లు దూసుకుపోతోంది. అయితే ఎప్పుడూ తన పని, పర్సనల్ జీవితం గురించి వార్తల్లో నిలిచే ఈ బ్యూటీ. ఈ సారి ఓ క్యూట్ బోయ్ పిక్చర్ చేసి న్యూస్‌లో నిలిచింది.


ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ డిస్నీ ప్లస్ హట్‌స్టార్‌లో ‘ఎన్‌కాంటో’ అనే యానిమేషన్ మూవీ విడుదలైంది. అందులో ఆంటోనియో అనే బ్లాక్ బోయ్ క్యారెక్టర్ ఉంటుంది. బ్యాక్‌గ్రౌండ్‌లో ఆ సినిమా టీవీలో ప్లే అవుతుండగా.. ఆ పాత్రని పోలిన కెంజో బ్రూక్స్ అనే బాలుడి ఫోటోని అతని తల్లి కహేషా బ్రాండ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. దానికి ‘పాతినిథ్యం ముఖ్యం’ అనే యాష్‌ట్యాగ్‌ని పెట్టింది. దీంతో ఈ పిక్ వైరల్‌గా మారింది.


ఈ పోస్ట్‌ని చూసిన ప్రియాంక దాన్ని షేర్ చేసింది. ఎంతో క్యూట్‌గా ఉన్న రెండు సంవత్సరాల బాలుడికి పిక్‌కి ‘అందుకే ఎక్కడైనా అందరి పాత్రినిథ్యం ముఖ్యమనేది’ అనే క్యాప్షన్ పెట్టింది ఈ భామ. దీనిపై ఎంతోమంది అభిమానులు ఆమె చాలా మంచి పనిని చేసిందని కామెంట్స్ పెడుతున్నారు.

అయితే ఈ పిక్ వైరల్‌గా మారడంపై ఆ బాలుడి తల్లి కహేషా.. ‘ఇదేంటో నా కుంటుంబానికి తెలుసు. కానీ ఇంతమంది నుంచి ప్రశంసలు వస్తాయని ఊహించలేదు. అందరి మనసుల్లో ఉన్నదాన్ని చూపించారని కామెంట్స్ పెడుతుండడం ఆనందంగా ఉంద‌’ని చెప్పుకొచ్చింది. కాగా, బ్యూటీఫుల్ ప్రియాంక షేర్ చేసిన ఆ పిక్‌ని మీరు ఓసారి చూసేయండి..


అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.