సైఫ్ అలీఖాన్ కొడుకుతో శ్వేత తివారి కూతురి వీడియో వైరల్.. ముఖం దాచుకున్న బ్యూటీ

ABN , First Publish Date - 2022-01-23T17:01:03+05:30 IST

బాలీవుడ్‌లోని సెలబ్రిటీల మధ్య స్నేహం ఉండడం మామూలే. వారు అప్పుడప్పుడూ బయటికి డిన్నర్‌కి వెళ్లడం మీడియా కంటపడకుండా జాగ్రత్త పడడం మామూలే...

సైఫ్ అలీఖాన్ కొడుకుతో శ్వేత తివారి కూతురి వీడియో వైరల్.. ముఖం దాచుకున్న బ్యూటీ

బాలీవుడ్‌లోని సెలబ్రిటీల మధ్య స్నేహం ఉండడం మామూలే. వారు అప్పుడప్పుడూ బయటికి డిన్నర్‌కి వెళ్లడం మీడియా కంటపడకుండా జాగ్రత్త పడడం మామూలే. తాజాగా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కొడుకు ఇబ్రహీం అలీఖాన్, నటి శ్వేత తివారి కూతురు ఫలక్ తివారి శుక్రవారం రాత్రి ఇలాగే మీడియా కంట పడ్డారు.


ఈ స్టార్ కిడ్స్ ఇద్దరూ ముంబైలోని ఓ రెస్టారెంట్‌లో డిన్నర్ చేసి బయటి వస్తూ మీడియాకి చిక్కారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో 20 ఏళ్ల ఇబ్రహీం, 21 ఏళ్ల ఫలక్ కారులో కూర్చున్నారు. ఆ సమయంలో మీడియా జనాలు అక్కడికి రావడంతో ఏం చేయాలో తెలియని ఈ బ్యూటీ చేతులతో తన ముఖాన్ని దాచుకుంది.


దీంతో వారిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ ప్రచారం మొదలైంది. అయితే ఆ వీడియోలో ఫలక్ ముఖాన్ని దాచుకోవడంపై విమర్శలు చేశారు నెటిజన్లు.



Updated Date - 2022-01-23T17:01:03+05:30 IST