నేనూ సాధారణ అమ్మాయినే.. ఎవరైనా అలా పిలిస్తే నాకు నచ్చదు : నటి

ABN , First Publish Date - 2022-01-21T20:56:19+05:30 IST

టెలివిజన్ నటిగా కెరీర్ ప్రారంభించి అనంతరం స్పెషల్ సాంగ్స్, సినిమాలతో నటిగా మంచి గుర్తింపు పొందింది నియా శర్మ...

నేనూ సాధారణ అమ్మాయినే.. ఎవరైనా అలా పిలిస్తే నాకు నచ్చదు : నటి

టెలివిజన్ నటిగా కెరీర్ ప్రారంభించి అనంతరం స్పెషల్ సాంగ్స్, సినిమాలతో నటిగా మంచి గుర్తింపు పొందింది నియా శర్మ. అయితే 2006లోనే టీవీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీకి దాదాపు దశాబ్దం తర్వాతే.. తనకంటూ గుర్తింపు సాధించింది. ఎందుకంటే 2016 సంవత్సరంలో మొదటి సారి ఓ మెగజైన్ పబ్లిస్ చేసిన ఆసియాస్ సెక్సీయస్ట్ వుమెన్ లిస్ట్‌లో నిలిచింది ఈ భామ. అలా ఒకసారి కాదు పలుమార్లు ఆ జాబితాలో నిలిచింది నియా.


అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనను ఎవరైనా హట్ అనికానీ, ప్రెటీ అనికానీ పిలిస్తే నచ్చదు అంటూ చెప్పుకొచ్చింది ఈ భామ. ఆ ఇంటర్య్వూలో.. ‘కొన్నిసార్లు మిమ్మల్ని అభినందిస్తున్న అవతలి వ్యక్తి మీనుంచి కేవలం కృతజ్ఞతలు మాత్రమే ఎక్సపెక్ట్ చేస్తారు. కానీ నేను అలా చేయలేను. అలాంటి వాటిని నేను జీర్ణించుకోలేకపోతున్నాను. నియా నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు.. నువ్వు చాలా హాట్‌గా ఉన్నావని ఎవరైనా చెబితే వాళ్లెందుకు అలా ఎందుకు చెబుతున్నారో నాకు అర్థం కాదు. కాబట్టి అతను నాతో ఎందుకు తప్పుడు విషయాలు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడని అనుకుంటూ ఉంటాన’ని చెప్పింది.


ఆమె ఇంకా మాట్లాడుతూ.. ‘నేను అలాంటి అమ్మాయిని కాను. నేను హట్ కూడా కాదు. అందరిలాగే నేను సాధారణ అమ్మాయిని. నేను పొగడ్తల కోసం వెంపర్లడను. అది నా ఎజెండా కాదు. అందుకే ఎవరైనా నన్ను అలా పిలిస్తే నచ్చదు’ అని తెలిపింది.

Updated Date - 2022-01-21T20:56:19+05:30 IST