అందరిని సమానంగా చూసే.. ఇక్కడ పుట్టినందుకు గర్వంగా ఉంది: Kangana Ranaut

దేశంలో జరిగే వివిధ అంశాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. కాంట్రవర్సీ క్వీన్‌గా పేరు తెచ్చుకుంది కంగనా రనౌత్. తాజాగా జనవరి 12న స్వామి వివేకానంద జయంతి సందర్భంగా సైతం  సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది ఈ భామ. స్వామి వివేకానందకు జయంతి సందర్భంగా అంటూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది ఈ బ్యూటీ.

అందులో.. ‘ప్రపంచానికి సహనం, సార్వత్రిక ఆమోదం రెండింటినీ బోధించిన మతానికి చెందినందుకు నేను గర్వపడుతున్నాను. మేము సార్వత్రిక సహనాన్ని విశ్వసించడం మాత్రమే కాకుండా.. మేము అన్ని మతాలను సత్యం అంగీకరిస్తామ’ని రాసుకొచ్చింది.

 

అయితే వివేకానందకి కంగనా నివాళి అర్పించడం ఇదే మొదటిసారి కాదు. గతేడాది సైతం ఆయనని స్మరించుకుంటూ ఓ పోస్ట్ పెట్టింది. అందులో.. ‘నన్ను నేను పోగొట్టుకున్నప్పుడు మీరు నన్ను కనుగొన్నారు. ఇక్కడే ఉండేలా నా చేయి పట్టుకున్నారు. ఏ ఆశలేదని భ్రమపడ్డప్పుడు నాకో పర్పస్ ఉందని గుర్తు చేశారు. నా గురువుగా మిమ్మల్ని మించిన దేవుడు లేడు. నా జీవితం మొత్తం నీకు అంకితం’ అంటూ రాసుకొచ్చింది.

Bollywoodమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.