స్టార్ కిడ్ ను అయినప్పటికీ రిక్షాలోనే స్కూల్ కు వెళ్ళేదాన్ని : ఇషా డియోల్
ABN , First Publish Date - 2021-09-22T17:16:23+05:30 IST
ఒకప్పుడు బాలీవుడ్ ను ఏలిన స్టార్ కపుల్ .. ధర్మేంద్ర , హేమమాలిని. ఇద్దరూ కలిసి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో జోడీగా నటించి ప్రేక్షకుల్ని అలరించారు. ప్రస్తుతం ఈ ఇద్దరూ సెలెక్టివ్ గా కొన్ని సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

ఒకప్పుడు బాలీవుడ్ ను ఏలిన స్టార్ కపుల్ .. ధర్మేంద్ర , హేమమాలిని. ఇద్దరూ కలిసి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో జోడీగా నటించి ప్రేక్షకుల్ని అలరించారు. ప్రస్తుతం ఈ ఇద్దరూ సెలెక్టివ్ గా కొన్ని సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ధర్మేంద్ర హేమమాలినిని రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వారికి ఇషా డియోల్, అహనా డియోల్ కూతుళ్ళు. వీరిలో ఇషా డియోల్ బాలీవుడ్ లో కథానాయికగా నటిస్తుండగా.. అహనా డియోల్ .. అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తోంది.
ఇటీవల మీడియా ఇంటరాక్షన్ లో ఇషా డియోల్ మాట్లాడుతూ.. తన తల్లిదండ్రుల గొప్పతనం గురించి వివరించింది. ఇద్దరూ సూపర్ స్టార్స్ . అయినప్పటికీ.. ఎప్పుడో డౌన్ టు ఎర్త్ ఉండేవారని, మమ్మల్ని చాలా బాగా పెంచారని.. ప్రత్యేకించి నా చిన్నతనం చాలా సాధారణంగా గడిచిందని, స్కూల్లో అయితే మమ్మల్ని ఎవరూ స్టార్ కిడ్స్ గా ట్రీట్ చేసేవారు కాదని, రిక్షాలోనే స్కూల్ కు వెళ్ళేవారమని తెలిపింది. ఇటీవల ఏక్ దువా అనే హిందీ చిత్రంలో నటించిన ఇషా.. ఈ ఏడాది మరిన్ని సినిమాల్లో నటిస్తోంది.
