సినిమా స్పెషల్ షోకు వెళ్లిన Disha Patani కి షాకింగ్ అనుభవం.. ఆమె డ్రస్సుపై నెటిజన్ల కామెంట్స్ ఇవీ..!

ABN , First Publish Date - 2021-12-03T17:45:44+05:30 IST

బాలీవుడ్‌లో మంచి పాపులారిటీ, ఫ్యాషన్ సెన్స్ ఉన్న నటీమణుల్లో ఒకరు దిశా పటానీ. ఈ బ్యూటీ ఏం చేసేనా అదో నార్మల్‌గానే సెన్సెషన్ అవుతూ ఉంటుంది. అయితే కొన్ని సార్లు మాత్రం అవి ఈ తారని ఇబ్బందుల్లో పడేస్తుంటాయి.

సినిమా స్పెషల్ షోకు వెళ్లిన Disha Patani కి షాకింగ్ అనుభవం.. ఆమె డ్రస్సుపై నెటిజన్ల కామెంట్స్ ఇవీ..!

బాలీవుడ్‌లో మంచి పాపులారిటీ, ఫ్యాషన్ సెన్స్ ఉన్న నటీమణుల్లో ఒకరు దిశా పటానీ. ఈ బ్యూటీ ఏం చేసేనా అదో నార్మల్‌గానే సెన్సెషన్ అవుతూ ఉంటుంది. అయితే కొన్ని సార్లు మాత్రం అవి ఈ తారని ఇబ్బందుల్లో పడేస్తుంటాయి. గత నెలలో ఓ కార్యక్రమానికి హాజరైనప్పుడు ఆమె ఫేస్ విషయంలో ట్రోలింగ్‌కి గురైంది. అయితే తాజాగా  డ్రెసింగ్‌పై మరోసారి ఈ భామని ట్రోల్ చేశారు నెటిజన్లు.


టాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘ఆర్‌ఎక్స్ 100’ బాలీవుడ్‌లో ‘తడప్’గా రిమేక్ అవుతున్న విషయం తెలిసిందే. ఇందులో సునీల్ శెట్టి కుమారుడు ఆహాన్ శెట్టి, తారా సుతారియా జంటగా నటించిన ఈ చిత్రం డిసెంబర్ 3న విడుదల కానుంది. ఈ తరుణంలో డిసెంబర్ 2న బాలీవుడ్ ప్రముఖుల కోసం ప్రిమీయర్‌ షో వేశారు మూవీ మేకర్స్. 


ఆ కార్య్రమానికి అతిథిగా హజరైంది అందాల తార దిశా పటానీ. 

దీనికి రివీలింగ్ టాన్ డ్రెస్‌ని వేసుకొచ్చి, అద్భుతమైన ఫిగర్‌ను చూపిస్తూ అభిమానులకు కనులవిందును కలిగించింది. అయితే

తొడల వరకే ఉన్న ఈ డ్రెస్‌పై కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.


‘దిశాకి చాలా వేడిగా ఉన్నట్లు ఉంది. అందుకే అలా డ్రెస్ వేసుకున్నట్లు ఉంద’ని కొందరు కామెంట్స్ పెట్టగా.. ‘ఈమె ఫ్యాషన్ సెన్స్ ఎంటో నాకు ఇప్పటికి వరకూ అర్థం కాలేదం’టూ మరికొందరు కామెంట్స్ పెట్టారు. కాగా, మిలన్ లుత్రియా దర్శకత్వంలో సాజిద్ నడియాడ్వాలా నిర్మించిన ఈ సినిమా స్ర్రినింగ్‌కి.. సల్మాన్ ఖాన్, ఆయుష్ శర్మ, అనుపమ్ ఖేర్, సంజయ్ కపూర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, కాజోల్, భూషణ్ కుమార్, రితేష్ దేశ్‌ముఖ్  హాజరై అహన్, ‘తడప్’ మూవీ టీంకి మద్దతు తెలిపారు.



Updated Date - 2021-12-03T17:45:44+05:30 IST