ఇండియన్ ప్రొఫెసర్‌కి సహాయం చేసిన ఈజిప్టు అభిమాని.. ఆటోగ్రాఫ్ చేసిన ఫోటో పంపిన షారుక్ ఖాన్

ABN , First Publish Date - 2022-01-23T18:26:45+05:30 IST

బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్‌కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికీ తెలుసు. ఆయన భారత దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు...

ఇండియన్ ప్రొఫెసర్‌కి సహాయం చేసిన ఈజిప్టు అభిమాని.. ఆటోగ్రాఫ్ చేసిన ఫోటో పంపిన షారుక్ ఖాన్

బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్‌కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికీ తెలుసు. ఆయన భారత దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఇటీవల ఓ ఇండియన్ ప్రోఫెసర్‌కి బాద్ షా ఈజిప్టు అభిమాని ఒకరు సహాయం చేయగా.. ఆ  వార్త వైరల్ అయిన విషయం తెలిసిందే.


తాజాగా ఆ ఈజిప్టు అభిమానికి సైన్ చేసి ఫోటోని, ఓ నోట్‌ని పంపించాడు షారుక్. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేసింది ఆ ఇండియన్ ప్రొఫెసర్. ఆమె చేసిన ట్వీట్‌లో ‘ఈ కథ మంచి ఎండింగ్ జరిగింది. షారుక్ సైన్ చేసిన మూడు ఫోటోలు ఈ రోజే అందాయి. 


అందులో ఒకటి ట్రావెల్ ఏజెంట్ నోట్, మరోకటి ఆయన కూతురు ఫోటో, ఇంకొకటి నా కూతురు కెతీకా వర్మ ఫోటో. ఈ సహయం చేసినందుకు పూజా దద్దానీ ధన్యవాదాలు. అలాగే ఇలాంటి బహుమతికి షారుక్‌కి కూడా’ అంటూ రాసుకొచ్చింది. అంతేకాకుండా ఆ పిక్స్‌ని సైతం పోస్ట్ చేసింది. 


నిజానికి ఇండియన్ ప్రొఫెసర్ అశ్విని ట్రావెలింగ్ కోసం టిక్కెట్టు బుక్ చేసుకుంది. కానీ, అతనికి మనీ ట్రాన్స్‌ఫర్ చేయడం కుదరలేదు. అయితే అతను షారుక్ అభిమాని కావడంతో.. ఆయన దేశానికి చెందిన వారు కావడంతో ఎలాంటి పేమెంట్ లేకుండానే టిక్కెట్ చేసిచ్చాడు. ఈ విషయాన్ని ఆ ఫ్రొఫెసరే స్వయంగా ట్విట్టర్‌లో పెట్టడంతో అప్పుడు వైరల్‌గామారింది. 


అదే సమయంలో కుదిరితే ఆయన కూతురి ఫోటో మీద బాద్ షా సైన్ చేసిన పిక్ ఒకటి పంపమని రిక్వెస్ట్ చేశాడంటూ ఆ ట్రావెల్ ఏజెంట్. దీంతో ఇలా షారుక్ పంపడంపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు.



Updated Date - 2022-01-23T18:26:45+05:30 IST