నాలుగు నెలల తర్వాత.. సోషల్‌మీడియాలో ప్రత్యక్షమైన స్టార్ హీరో
ABN , First Publish Date - 2022-01-19T20:58:42+05:30 IST
బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్‌కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే...

బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్‌కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ఎంతో కష్టపడి ఒక్కో మెట్టు ఎక్కుతూ బాలీవుడ్ బాద్ షా అని పిలిపించుకునే స్థాయికి ఎదిగాడు ఈ నటుడు. అంతేకాకుండా ఈ స్టార్‌కి సోషల్ మీడియాలో సైతం మంచి ఫాలోయింగే ఉంది. దీంతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంతో యాక్టివ్‌గా ఉంటూ బ్రాండింగ్, అడ్వర్టైజ్‌మెంట్స్ సైతం చేస్తుంటాడు.
అయితే గతేడాది షారుక్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ని డ్రగ్స్ తీసుకున్నాడనే అభియోగంతో అరెస్టు చేసింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్. దీంతో అప్పుడు ఆయన సినిమాలను వాయిదా వేయడమే కాకుండా సోషల్ మీడియాకి సైతం దూరంగా ఉంటూ వచ్చాడు.
కాగా, ఆర్యన్ డ్రగ్స్ కేసు బిజీ నుంచి బయటికి వచ్చిన ఈ షారుక్.. సినిమాల షూటింగ్స్ షూరూ చేశాడు. అంతేకాకుండా దాదాపు నాలుగు నెలల తర్వాత మొదటిసారి సోషల్ మీడియాలో ఓ వీడియోని పోస్ట్ చేశాడు. అందులో ఎల్‌జీ కంపెనీ సంబంధించిన ఓఎల్‌ఈడీ టీవీని ప్రమోట్ చేశాడు ఈ స్టార్. చాలా రోజుల తర్వాత కనిపించడంతో ‘కింగ్ ఈజ్ బ్యాక్’ అంటూ ఈ వీడియోపై కామెంట్ల వర్షం కురిపించారు ఆయన ఫ్యాన్స్. దీంతో ఇది వైరల్‌గా మారింది. మీరు ఓసారి చూసేయండి..