ఫ్యాన్‌కి ప్రాంక్ కాల్ చేసిన యంగ్ హీరో.. నవ్వులు పంచుతున్న వైరల్ వీడియో

ABN , First Publish Date - 2021-12-25T17:07:21+05:30 IST

‘సోనీ కి టీటు కీ స్వీటీ’ సినిమాతో పాపులారిటీ సాధించిన నటుడు కార్తీక్ ఆర్యన్. ఇటీవలే నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధమాకా’ సినిమాతో పలకరించిన ఈ యంగ్ హీరో ప్రస్తుతం ‘షాహ్‌జాదా’ అనే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నాడు..

ఫ్యాన్‌కి ప్రాంక్ కాల్ చేసిన యంగ్ హీరో.. నవ్వులు పంచుతున్న వైరల్ వీడియో

‘సోనీ కి టీటు కీ స్వీటీ’ సినిమాతో పాపులారిటీ సాధించిన నటుడు కార్తీక్ ఆర్యన్. ఇటీవలే నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధమాకా’ సినిమాతో పలకరించిన ఈ యంగ్ హీరో ప్రస్తుతం ‘షాహ్‌జాదా’ అనే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నాడు. టాలీవుడ్ హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన సూపర్ హిట్ సాధించిన ‘అలవైకుంఠపురములో’ మూవీకి ఇది రిమేక్.


కార్తీక్ సినిమా షూటింగ్ ప్రస్తుతం పునేలోని ఓ కాలేజ్‌లో జరుగుతోంది. ఆ సమయంలో ఆయన చుట్టూ కాలేజ్ స్టూడెంట్స్ చేరారు. అనంతరం ఓ లేడి ఫ్యాన్‌కి ప్రాంక్ కాల్ చేశాడు ఈ యంగ్ హీరో. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో ‘యష్‌ని మాట్లాడుతున్న.. కార్తీక్ ఆర్యన్ ఎక్కడా’ అని అడిగాడు. మొదట ఆ ఫ్యాన్ ఆశ్చర్య పోయినప్పటికి అనంతరం ఆ హీరో వాయిస్‌ని గుర్తు పట్టింది. వెంటనే ‘మీరు కార్తీక్ ఆర్యన్ కదా’ అంటూ అడగగా.. అవునని తెలిపాడు ఈ ధమాకా హీరో. దీంతో అక్కడే ఉన్న విద్యార్థులు నవ్వుతూ ఆయనని ఎంకరేజ్ చేశారు.


అయితే ఇంతకుముందే ఓ క్లిప్‌ని షేర్ చేశాడు కార్తీక్. అందులో ఆయన క్రికెట్ అడుతూ ఉన్నాడు ఈ యంగ్ హీరో. దీంతో రణ్‌వీర్ సింగ్ ‘83’, షాహిద్ కపూర్ ‘జెర్సీ’ తర్వాత కార్తీక్ క్రికెట్ ఆధారంగా మూవీ చేయనున్నట్లు వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.



Updated Date - 2021-12-25T17:07:21+05:30 IST